Justice Seetharam Reddy : ఉమ్మడి ఏపీ విశ్రాంత లోకాయుక్త జస్టిస్‌ సీతారాంరెడ్డి కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్త, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అద్దూరి సీతారాంరెడ్డి (94) న‌వంబ‌ర్ 17వ తేదీ (గురువారం) తెల్ల‌వారుజామున జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపూర్‌లో 1928 మార్చి 20వ తేదీన చిన్నారెడ్డి, వెంకట్రామమ్మ దంపతులకు జన్మించిన సీతారాంరెడ్డికి భార్య మనోరమాదేవి, నలుగురు కుమార్తెలు ఉన్నారు. నిజాం కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ చేసిన ఆయన లండన్‌లో న్యాయవాద విద్యను అభ్యసించారు. 1978 నుంచి 90 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందించారు. 1990 నుంచి 95 వరకు లోకాయుక్తగా పనిచేశారు. అలాగే 1989 నుంచి 96 వరకు ఆర్‌బీవీఆర్‌ఆర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ప్రముఖ న్యాయవేత్త పాల్కీవాలా వద్ద ఆయన జూనియర్‌గా వృత్తిని ప్రారంభించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం లా కాలేజీలో లెక్చరర్‌గా కూడా పని చేశారు. 1968లో ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడిగా కొనసాగిన ఆయన 1974లో హైకోర్టులో ప్రభుత్వ ప్లీడర్‌గా పని చేశారు.

#Tags