ex-MP Chandan Mitra: రాజ్యసభ మాజీ సభ్యుడు చందన్‌ ఏ పత్రిక ఎడిటర్‌గా పనిచేశారు?

ఆంగ్ల దినపత్రిక ది పయనీర్‌ ఎడిటర్, రాజ్యసభ మాజీ సభ్యుడు చందన్‌ మిత్రా(65) కన్నుమూశారు.

 ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సెప్టెంబర్‌ 1న ఢిల్లీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. జర్నలిస్ట్‌గా సుదీర్ఘ కాలం పనిచేసిన మిత్రా సమకాలీన రాజకీయ పరిణామాలపై చురుగ్గా స్పందిస్తారనే పేరుంది. 1997లో పయనీర్‌లో కీలక బాధ్యతలు చేపట్టడానికి ఆయన ముందు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, హిందుస్తాన్‌ టైమ్స్‌ తదితర పత్రికల్లో పనిచేశారు. అనారోగ్య కారణాలతో పయనీర్‌ పత్రిక పబ్లిషర్‌ హోదాకు రాజీనామా చేసిన ఆయన... ఎడిటర్‌గా కొనసాగుతున్నారు. ఎల్‌కే అద్వానీకి సన్నిహితుడైన మిత్రా బీజేపీ తరఫున రెండు పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2018లో బీజేపీకి రాజీనామా చేసి, టీఎంసీలో చేరిన ఆయన క్రియాశీలక రాజకీయాలకు మాత్రం దూరంగా ఉండిపోయారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ది పయనీర్‌ ఎడిటర్, రాజ్యసభ మాజీ సభ్యుడు కన్నుమూత
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 1
ఎవరు    : చందన్‌ మిత్రా(65)
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : అనారోగ్యం కారణంగా...
 

#Tags