Dhruvi Patel: 'మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024' విజేత ధ్రువీ పటేల్

'మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024' టైటిల్‌ను ధ్రువీ పటేల్ అనే యువతి గెలుచుకుంది.

అమెరికాలోని న్యూ జెర్సీ ఎడిసన్‌లో జరిగిన ఈ పోటీలో ఆమె విజేతగా నిలిచింది. ప్రస్తుతం ఆమె కంప్యూటర్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్స్‌లో చదువుతున్నారు. 

ఇతర విజేతలు వీరే..

మిస్టర్స్‌ కేటగిరీలో ట్రినిడాడ్‌ టోబాగోకు చెందిన సువాన్‌ మౌట్టెట్‌ విజేతగా నిలవగా, యూకేకు చెందిన స్నేహ నంబీయార్‌ ఫస్ట్‌ రన్నరప్‌గా, యూకేకు చెందిన పవన్‌దీప్‌ కౌర్‌ సెకండ్‌ రన్నరప్‌గా నిలిచారు.

మిస్‌ టీన్‌ వరల్డ్‌వైడ్‌ కేటగిరీలో గ్వాడెలోప్‌కు చెందిన సియెర్రా సూరెట్‌ టైటిల్‌ దక్కించుకుంది. నెదర్లాండ్స్‌కు చెందిశ్రేయా సింగ్‌ తొలి రన్నరప్‌గా, సురినామ్‌కు చెందిన శ్రద్ధ టెడ్‌జోయ్‌ రెండో రన్నరప్‌గా నిలిచింది.

న్యూయార్క్‌కు చెందిన ఇండియా ఫెస్టివల్‌ కమిటీ 31 ఏళ్లుగా(ఈ ఏడాదితో కలిపి) ఈ ఈవెంట్‌ నిర్వహిస్తోంది. ఇండో అమెరికన్లు నీలం, ధర్మాత్మ శరణ్‌లు ఈ ఈవెంట్‌ నిర్వాహకులు. 

World Skills: వరల్డ్‌ స్కిల్స్‌–2024లో భారత్‌కు 16 పతకాలు.. సత్తా చాటిన తెలంగాణ అమ్మాయి

#Tags