Miss India USA: మిస్‌ ఇండియా యూఎస్‌ఏ 2024గా చెన్నై యువతి

చెన్నైకి చెందిన కాట్లిన్ సాండ్రా నీల్ (19) ఈ ఏడాది మిస్ ఇండియా యూఎస్ఏ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.

అమెరికాలోని న్యూజెర్సీలో నిర్వహించిన అమెరికాలోని న్యూజెర్సీలో నిర్వహించిన వార్షిక పోటీల్లో ఆమె ఈ  కిరీటాన్ని అందుకున్నారు. 

కాట్లిన్‌ ప్రస్తుతం డావీస్‌లోని క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు. కాట్లిన్ 14 సంవత్సరాల వయసులో భారతదేశం నుంచి అమెరికాకు వలస వచ్చినారు. ఆమె వెబ్ డిజైనర్‌గా, అలాగే మోడలింగ్, నటనలో కెరీర్ సృష్టించాలనుకుంటున్నారు.

మిసెస్‌ ఇండియా యూఎస్‌ఏగా సంస్కృతి శర్మ, మిస్‌ టీన్‌ యూఎస్‌గా వాషింగ్టన్‌కు చెందిన అర్షిత కట్‌పాలియా నిలిచారు. మూడు కేటరిగీల్లో నిర్వహించిన ఈ పోటీలో మొత్తం 47 మంది, ప్రాదేశిక పోటీల్లో నుంచి 25 రాష్ట్రాల యువతులు పాల్గొన్నారు.  

Jamsetji Tata award: కిరణ్‌ మజుందార్‌ షాకు జెంషెడ్‌జీ టాటా అవార్డు

అలాగే.. మిస్ ఇండియా యూఎస్ఏ పోటీ విజేతగా నిరాలి దేశియా (ఫస్ట్ రన్నరప్), మానిని పటేల్ (సెకండ్ రన్నరప్) నిలిచారు. మిసెస్ ఇండియా యూఎస్ఏ పోటీలో సప్నా మిశ్రా (ఫస్ట్ రన్నరప్), చిన్మయి అయ్యచిత్ (సెకండ్ రన్నరప్) నిలిచారు. టీన్ కేటగిరీలో ధృతి పటేల్ (ఫస్ట్ రన్నరప్), సోనాలి శర్మ (సెకండ్ రన్నరప్)గా నిలిచారు. 

#Tags