Amit Shah: అధికార భాషపై పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన‌ అమిత్ షా

కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా అధికార భాషా పార్లమెంటరీ కమిటీ ఛైర్‌ప‌ర్సన్‌గా ఎన్నికయ్యారు.

కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అధికార భాషపై పార్లమెంటరీ కమిటీని పునర్నిర్మించేందుకు న్యూఢిల్లీలో కమిటీ సమావేశం జరిగింది. 2019లో తొలిసారిగా కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన అమిత్ షా 2024 వరకు పనిచేశారు. తనను ఛైర్‌పర్సన్‌గా మళ్లీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అమిత్ షా.. గత దశాబ్దంలో హిందీ ప్రోత్సహించడంలో సాధించిన పురోగతిని హైలైట్ చేస్తూ, హిందీ స్థానిక భాషలతో పోటీ పడకుండా, వాటితో సహచరంగా ఉండాలని లక్ష్యంగా పెట్టారు. హిందీ అన్ని ప్రాంతీయ భాషలకు మిత్రభాషగా మారాలని, ఇతర భాషలు మాట్లాడే వ్యక్తుల్లో తక్కువతనం భావన సృష్టించకుండా ఆమోదాన్ని పెంచడం ముఖ్యమని చెప్పారు. 
 
అధికార భాషల చట్టం 1963లోని సెక్షన్ 4 ప్రకారం.. 1976లో అధికార భాషపై పార్లమెంటరీ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ లోక్‌స‌భ, రాజ్యసభకు చెందిన 30 మంది సభ్యులతో ఉంటుంది.  

Most Influential People: ‘ఏఐ 2024 అత్యంత ప్రభావశీలమైన వ్యక్తుల’ జాబితాలో టాప్ 10లో ఉన్న‌ది వీరే..

#Tags