Jiya Rai: అతి చిన్న వయసులో పారా స్విమ్మర్‌గా రికార్డు సృష్టించిన జియా రాయ్!

ముంబైకి చెందిన 16 ఏళ్ల జియా రాయ్ అతి చిన్న వయసులో అత్యంత వేగంగా పారా స్విమ్మర్‌గా రికార్డు సృష్టించింది.

ఆమె ఒక ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్తో బాధపడుతున్నప్పటికీ, తన ఈత ప్రతిభతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది.

పాక్ జలసంధి ఛాలెంజ్: జియా 2022లో శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి భారత్‌లోని ధనుస్కోడి వరకు 29 కిలోమీటర్ల పొడవైన పాక్ జలసంధిని అతి తక్కువ సమయంలో ఈదడం ద్వారా ఒక రికార్డు సృష్టించింది. ఇంత చిన్న వయసులో ఇలాంటి ఘనత సాధించడం అంటే చాలా గొప్ప విషయం.

ఇంగ్లీష్ ఛానల్ విజయం: ఇటీవల జియా ఇంగ్లీష్ ఛానల్ అనే ప్రపంచ ప్రసిద్ధమైన జలసంధిని దాటింది. ఇంగ్లాండ్‌లోని అబాట్స్ క్లిఫ్ నుంచి ఫ్రాన్స్‌లోని పాయింట్ డి లా కోర్టే-డ్యూన్ వరకు 34 కిలోమీటర్ల దూరాన్ని జియా రాయ్ 17 గంటల 25 నిమిషాల్లో ఈది రికార్డు సృష్టించింది. 

ఇంగ్లీష్ ఛానల్ గురించి.. 
➣ఇంగ్లీష్ ఛానల్ చాలా కాలంగా ఈత క్రీడాకారులకు ఒక గొప్ప సవాలుగా ఉంది.
➣ మిహిర్ సేన్ అనే భారతీయుడు 1958లో ఈ ఛానల్‌ను ఈదిన మొదటి భారతీయుడిగా రికార్డులు సృష్టించాడు.
➣ ఆర్తి సాహా అనే మహిళ 1959లో ఈ ఛానట్‌ను ఈదిన మొదటి భారతీయ మహిళగా రికార్డు పొందింది.
➣ అనిత సూద్ అనే మహిళ 1987లో ఈ ఛానల్‌ను దాటడానికి తీసుకున్న కనీస సమయం రికార్డును కలిగి ఉంది.
➣ ఆస్ట్రేలియా స్విమ్మర్ క్లోయి మెక్ కార్డెల్ 44 క్రాసింగ్‌లతో అత్యధిక ఛానల్ స్విమ్స్ ఆడిన రికార్డు సృష్టించాడు.

Kargil Vijay Diwas: 4 రోజుల్లో 160 కి.మీ.లు పరిగెత్తిన ఆర్మీ మాజీ అధికారిణి!

#Tags