Union Cabinet: మూడు నిర్ణయాలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం.. అవి ఏవంటే..

కేంద్ర కేబినెట్‌ మూడు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.

బయో ఈ-3 విధానం, విజ్ఞాన్‌ ధార, ఇంటర్‌ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌నకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్‌ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూనియన్ పెన్షన్ స్కీమ్న్(యుపీఎస్) అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. 

విజ్ఞాన్‌ ధార పేరుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్‌ పథకాన్ని తీసుకురానుంది. సర్వీస్‌లో 25 ఏళ్లు పూర్తయిన వారికి పూర్తి పెన్షన్‌ ఇవ్వనుంది. ఈ పథకం కింద 15వ ఆర్థిక సంఘంలో 10,579 కోట్ల రూపాయల ఖర్చు చేయనుంది. సుమారు 23 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి కలగనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి అమలు కానుంది.

రిటైర్మెంట్‌కు ఏడాది ముందు ఉన్న సగటు జీతంలో సగం మొత్తం పెన్షన్‌గా అందజేసేలా కొత్త విధానం తీసుకువచ్చింది. పెన్షనర్ మరణిస్తే 60 శాతం కుటుంబానికి వచ్చేలా అమలు చేయనున్నారు.

SC-ST Act: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. కులం పేరిట వేధిస్తేనే ఎస్సీ, ఎస్టీ కేసు

బయో ఈ-3(బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ ఎంప్లాయ్‌మెంట్) విధానం ద్వారా త్వరలో బయో విప్లవం రాబోతోంది.. బయో టెక్నాలజీ, బయో సైన్స్‌ రంగాల్లో అధిక ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎంప్లాయిమెంట్ ఆధారంగా బయో మనుఫ్యాక్చరింగ్ విధానం ఉంటుంది.

#Tags