PMGSY-IV: 31 వేల మెగావాట్ల హైడ్రో ప్రాజెక్టులకూ గ్రీన్‌ సిగ్నల్‌

2024-25 నుంచి 2028-29 వ‌ర‌కు రూ.70,125 కోట్లతో ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన-4ను అమలు చేయనున్నారు.

➣ రూ.12,461 కోట్ల వ్యయంతో మొత్తంగా 31,350 మెగావాట్ల సామర్థ్యంతో జలవిద్యుత్‌ ప్రాజెక్టులకూ కేంద్ర కేబినెట్‌ ఓకే చెప్పింది.
  
➣ పీఎం గ్రామ్‌ సడక్‌ యోజన–4 కింద అదనంగా 62,500 కి.మీ. మేర రోడ్ల నిర్మాణానికి కేబినెట్‌ సరేనంది. కొత్తగా 25 వేల జనావాసాలను కలుపుతూ ఈ రోడ్లను నిర్మించనున్నారు. ఈ మార్గాల్లో వంతెనలనూ ఆధునీకరించనున్నారు. 

➣ విద్యుత్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పీఎం ఈ–డ్రైవ్, పీఎం–ఈబస్‌ సేవా–పేమెంట్‌ సెక్యూరిటీ మెకానిజం పథకాల అమలు కోసం రూ.14,335 కోట్లు కేటాయించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. విద్యుత్‌ ద్విచక్ర, త్రిచక్ర, అంబులెన్స్, ట్రక్కు, ఇతర వాహనాలపై రూ.3,679 కోట్ల మేర సబ్సిడీ ప్రయోజనాలు పౌరులకు కల్పించనున్నారు. 

➣ ముందస్తు వాతావరణ అంచనా వ్యవస్థలను మరింత బలోపేతం చేయనున్నారు. రెండేళ్లలో రూ.2,000 కోట్ల వ్యయంతో ‘మిషన్‌ మౌసమ్‌’ను అమలుచేయనున్నారు. భారత వాతావరణ శాఖతో పాటు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రోపికల్‌ మెటరాలజీ, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మీడియం రేంజ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌ విభాగాల ద్వారా ఈ మిషన్‌ను అమలు చేయనున్నారు.

Health Insurance: 70 ఏళ్లు పైబడిన వారందరికీ.. ఏటా రూ.5 లక్షల ఆరోగ్య బీమా

#Tags