Amaravati Railway Line: అమరావతి రైల్వేలైన్‌కు కేంద్రం ఆమోదం

అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం ఇచ్చినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రూ.2.245 కోట్లతో గుంటూరు జిల్లా నంబూరు నుంచి అమరావతి మీదుగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం వరకు 57 కిలో మీట‌ర్ల‌ సింగిల్ లైన్ నిర్మించనున్నట్లు తెలిపారు.

ఈ ప్రాజెక్టులో మెట్రో సిటీలైన హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, నాగ్‌పూర్‌ను అమరావతికి అనుసంధానం చేస్తారని చెప్పారు. గంటకు 160 కి.మీ. వేగంతో సెమీ హైస్పీడ్ లైన్ నిర్మించనున్నట్లు చెప్పారు. కృష్ణా నదిపై 8.2 కి.మీ. వంతెన నిర్మాణం కూడా ప్రణాళికలో ఉంది.

ఈ ప్రాజెక్టు 4 సంవత్సరాల్లో పూర్తి కావాలని లక్ష్యం, భవిష్యత్తులో డబుల్ లైన్ విస్తరించడానికి భూసేకరణ జరుగుతోందన్నారు. కృష్ణా నదిపై నిర్మించనున్న 3.2 కి.మీ. వంతెనను ఐకానిక్ బ్రిడ్జిగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Drone Summit 2024: అమరావతిలో డ్రోన్స్‌ సమ్మిట్.. క‌ర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ హబ్

అలాగే.. శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద చెన్నై-కోల్‌క‌తా జాతీయ రహదారిపై రూ.252.42 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ ఆ ప్రాంతంలోని రహదారి భద్రతను పెంచి సామాజిక, ఆర్థికాభివృద్ధికి సహాయపడుతుందని మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

#Tags