Foreign Leaders: మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరైన‌ 7 దేశాల అధినేతలు వీరే..

వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు.

జూన్ 9వ తేదీ జ‌రిగిన మోదీ ప్రమాణ స్వీకారోత్సవం కన్నులపండువగా జరిగింది. మోదీ ప్రమాణ స్వీకారానికి 7 దేశాల అధినేతలు హాజరయ్యారు. 

బంగ్లాదేశ్‌ అధ్యక్షురాలు షేక్‌ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే, మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌కు మార్‌ జగన్నాథ్, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు, నేపాల్‌ ప్రధానమంత్రి పుష్ప కమల్‌ దహల్‌ ప్రచండ, భూటాన్‌ ప్రధానమంత్రి త్సెరింగ్‌ టాగ్‌బే, సీషెల్స్‌ ఉపాధ్యక్షుడు అహ్మద్‌ అఫిఫ్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్, మాల్దీవుల మద్య సంబంధాలు బలహీనపడ్డ నేపథ్యంలో ముయిజ్జు హాజరు ప్రాధాన్యం సంతరించుకుంది. 2023 నవంబర్‌లో అధ్యక్షుడయ్యాకఆయన భారత్‌ రావడం ఇదే తొలిసారి.

Narendra Modi: ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ.. 72 మందితో కొలువుదీరిన కేంద్ర మంత్రివర్గం ఇదే..

అలాగే ఈ కార్య‌క్ర‌మంలో.. మాజీ రాష్ట్రపతులు ప్రతిభా పాటిల్, రామ్‌నాథ్‌ కోవింద్‌ తదితరులు పాల్గొన్నారు. షారుఖ్‌ ఖాన్‌ నుంచి రజనీకాంత్‌ దాకా పలువురు సినీ ప్రముఖులు కుటుంబ సమేతంగా హాజరై అలరించారు. పారిశ్రామికవేత్తలు గౌతం అదానీ దంపతులు, ముకేశ్‌ అంబానీ దంపతులు వేడుకకు హాజరయ్యారు. 

#Tags