Earthquake: ఉత్తరాదిని వణించిన భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 5.7గా నమోదు

ఢిల్లీతోపాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో జూన్ 13న (మంగళవారం) భారీ భూకంపం సంభవించింది.

మధ్యాహ్నం 1:30 తర్వాత సంభవించిన భూకంపం కొన్ని సెకన్ల పాటు కొనసాగింది. జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లా గందో భలేసా గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో 30 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఢిల్లీ, పంజాబ్ సహా ఉత్తరాది ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి.  
భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 5.4గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. మణిపూర్‌లో స్వల్పంగా భూమి కంపించగా, పాకిస్థాన్‌లోని లాహోర్‌లోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. కాగా ఆఫ్ఘనిస్తాన్‌లో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించిన నేపథ్యంలో గత నెల చివర్లో ఢిల్లీలో తేలికపాటి ప్రకంపనలు వచ్చాయి.

Ayodhya: ‘అయోధ్య’ తొలి అంతస్తు దాదాపు పూర్తి.. వివరాలు వెల్లడించిన ట్రస్ట్‌

 

#Tags