Mehul Choksi: మెహుల్‌ చోక్సీపై రెడ్‌కార్నర్‌ నోటీస్‌ ఎత్తివేత !

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు రూ.13,000 కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీపై ఇంటర్‌పోల్‌ గతంలో జారీచేసిన రెడ్‌కార్నర్‌ నోటీసును ఇటీవల ఎత్తేసిన విషయం తాజాగా వెలుగులోకి రావడంతో విపక్ష కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది.

‘విపక్షాలపైకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్, సీబీఐను కేంద్రం ఉసిగొల్పుతూ తమ మిత్రుడిని వదిలేసింది. ఇలాంటి వ్యక్తులను పరిరక్షించే బీజేపీ పెద్దలు దేశభక్తి గురించి మాట్లాడటం.. నిజంగా ఒక పెద్ద జోక్‌’ అని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. కాగా, ఇంటర్‌పోల్‌ తన డాటాబేస్‌ నుంచి చోక్సీ పేరును తొలగించడాన్ని సీబీఐ తప్పుబట్టింది. ఆయన పేరును మళ్లీ చేర్చి రెడ్‌కార్నర్‌ నోటీసును పునరుద్ధరించాలని ఇంటర్‌పోల్‌ను కోరింది. పేరు తొలగించాలని పలుమార్లు చోక్సీ కోరడంతో ఇంటర్‌పోల్‌లోని స్వతంత్ర సీసీఎఫ్‌ విభాగం ఆ పని చేసింది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (19-25 ఫిబ్రవరి 2023)

#Tags