Indonesia President: గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా రానున్న ఇండోనేషియా అధ్యక్షుడు
2025 జనవరి 26వ తేదీ జరిగే భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోను ఆహ్వానించనున్నట్లు సమాచారం.
ఇది ఒక ప్రత్యేక సంప్రదాయంగా కొనసాగుతోంది. ఇంతకు ముందు 1950లో మొదటి ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రబోవో.. భారత్-ఇండోనేషియా సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తుండగా, బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలు వంటి రక్షణ ఒప్పందాలపై దృష్టి సారించారు. ఇదే జరిగితే.. ఫిలిప్పీన్స్ తర్వాత భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసిన రెండో దేశంగా ఇండోనేషియా అవతరిస్తుంది.
అలాగే.. ప్రబోవో భారత గణతంత్ర వేడుకలకు హాజరైతే, ఇండోనేషియా సైనిక బృందం కూడా రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొంటుంది. ఈ నెలాఖరుకు బ్రెజిల్‌లో జరుగనున్న జీ-20 సదస్సు సందర్భంగా ప్రబోవో మరియు ప్రధాని నరేంద్ర మోదీ మధ్య భేటీ జరుగవచ్చు.
Asia-Pacific Conference: ఢిల్లీలో ‘ఆసియా–పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్’ సదస్సు
#Tags