President Droupadi Murmu: విశ్వబంధు భారత్‌కు రాజ్యాంగమే పునాది.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరిస్తూ సామాన్య ప్రజల జీవితాలను మెరుగ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కలిసికట్టుగా పని చేయాల్సిన బాధ్యత కార్యనిర్వాహక వర్గం, శాసననిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థపై ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు.

పౌరుల ప్రాథమిక విధులను రాజ్యాంగంలో స్పష్టంగా నిర్దేశించారని చెప్పారు. దేశ ఐక్యత, సమగ్రత, సమాజంలో సామరస్యంతోపాటు మహిళల గౌరవాన్ని కాపాడడం పౌరుల విధి అని చెప్పారు. 

భారత రాజ్యాంగం ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, రాజ్యాంగ దినోత్సవాన్ని న‌వంబ‌ర్ 26వ తేదీ పాత పార్లమెంట్ భవనంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తమ ప్రసంగంలో పలు కీలక అంశాలను వెల్లడించారు.

అందులోని ప్రధానాంశాలు ఇవే..
రాష్ట్రపతి రాజ్యాంగం ప్రకారం పౌరుల ప్రాథమిక విధులు కూడా స్పష్టంగా నిర్దేశించబడ్డాయని చెప్పారు. దేశ ఐక్యత, సమగ్రత, సమాజంలో సామరస్యంతోపాటు మహిళల గౌరవాన్ని కాపాడడం కూడా పౌరుల ముఖ్య విధిగా పేర్కొన్నారు.

రాజ్యాంగ విలువలు: సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి వంటి లక్ష్యాలను సాధించడంలో రాజ్యాంగం కీలక పాత్ర పోషించిందని తెలిపారు. భారత రాజ్యాంగం ప్రగతిశీల పత్రంగా భావించవచ్చని, ఇది మారుతున్న కాలానికి అనుగుణంగా శక్తివంతమైన వ్యవస్థను అందించినట్లు కొనియాడారు.

భారతదేశం యొక్క ప్రగతి: భారతదేశం ఇప్పుడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని, విశ్వబంధువుగా ప్రపంచంలో చురుకైన పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొన్నారు.

Constitution of India: నేడు రాజ్యాంగ దినోత్సవం.. దీని నేపథ్యం ఇదే..

భవిష్యత్తు లక్ష్యాలు: ‘2047 నాటికి వికసిత్ భారత్’ అనే లక్ష్యాన్ని ఉద్దేశించి, ప్రజలందరూ ఒకటి కావాలని, ప్రాథమిక విధులను పూర్తి చేయాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రసంగం: పార్లమెంట్ లో నిర్మాణాత్మక చర్చలు జరగాలని, ప్రజాస్వామ్య మద్యం ను మరింత బలోపేతం చేయాలని జగదీప్ ధన్‌ఖడ్ తెలిపారు.

రాజ్యాంగ పీఠికలో "భారతదేశ ప్రజలమైన మేము" అన్న వాక్యాన్ని గుర్తుచేసి, ప్రజలే అత్యున్నతం అని పేర్కొన్నారు.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. రాజ్యాంగం సామాజిక మార్పుకు మరియు ఆర్థిక ప్రగతికి మార్గనిర్దేశకంగా నిలిచిందని తెలిపారు. రాజ్యాంగ విలువలను పాటిస్తూ చర్చలను కొనసాగించాలని ఎంపీలకు సూచించారు.

Rajya Sabha: రాజ్యసభ ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల

#Tags