Supreme Court: సుప్రీం జడ్జీలుగా అలహాబాద్, గుజరాత్‌ హైకోర్టు సీజేలు

అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాజేశ్‌ బిందాల్, గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌లను సుప్రీంకోర్టులో జడ్జీలుగా ఎంపికచేయాలని కేంద్రప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం కొలీజియం సిఫార్సుచేసింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియంలో జస్టిస్‌ కేఎం జోసెఫ్, జస్టిస్‌ ఎస్‌కే కౌల్, జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ అజయ్‌ రస్తోగీ, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సభ్యులుగా ఉన్నారు. కొత్త జడ్జీల ఎంపిక కోసం డిసెంబర్‌ 13న కొలీజియం సమావేశమై ఆ తర్వాత తుది తీర్మానం చేసి ఆ వివరాలను తాజాగా సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
రాజస్తాన్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్, పట్నా హైకోర్టు సీజే జస్టిస్‌ సంజయ్‌ కరోల్, మణిపూర్‌ హైకోర్టు సీజే జస్టిస్‌ పీవీ సంజయ్‌ కుమార్, పట్నా హైకోర్టు జడ్జి జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా, అలహాబాద్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాల పేర్లనూ కొలీజియం సిఫార్సుచేసింది. అన్ని రాష్ట్రాల హైకోర్టులకు సుప్రీంకోర్టులో ప్రాతినిధ్యం ఉండేలా, జడ్జీలుగా సుదీర్ఘ అనుభవం, హైకోర్టుల్లో వారి సీనియారిటీ, భిన్న వర్గాలకు సముచిత స్థానమిస్తూ వీరిని జడ్జీలను ఎంపికచేసినట్లు కొలీజియం తీర్మానం స్పష్టంచేసింది. నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టులో సీజేఐతో కలుపుకుని గరిష్టంగా 34 మంది జడ్జీలు ఉండవచ్చు. ప్రస్తుతం కోర్టులో 27 మంది జడ్జీలు కొనసాగుతున్నారు. 

Andaman Islands: అండమాన్‌లో 21 దీవులకు ‘పరమ వీరచక్ర’ల పేర్లు

#Tags