PAIR Programme: ఉన్నత విద్యా సంస్థల్లో పరిశోధనకు PAIR ప్రోగ్రాం

కేంద్ర ప్రభుత్వం, ఉన్నత విద్యా సంస్థల్లో (HEIs) పరిశోధనను ప్రోత్సహించడానికి పార్టనర్‌షిప్స్ ఫర్ యాక్సిలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ (PAIR) అనే కొత్త ప్రోగ్రాంను ప్రారంభించనుంది.

ఈ ప్రోగ్రాం యొక్క ప్రధాన లక్ష్యం.. ఉన్నత స్థాయి పరిశోధనా సంస్థలను, పరిశోధనా సామర్థ్యం తక్కువగా ఉన్న సంస్థలతో అనుసంధానించడం ద్వారా.. ఉన్నత విద్యా సంస్థల్లో పరిశోధనా సామర్థ్యాలను పెంచడం.

హబ్ & స్పోక్ ఫ్రేమ్‌వర్క్: ఈ ప్రోగ్రామ‌ ద్వారా, పరిశోధన సామర్థ్యం ఎక్కువగా ఉన్న సంస్థలు (హబ్‌లు) పరిశోధన సామర్థ్యం తక్కువగా ఉన్న సంస్థలకు (స్పోక్‌లు) మార్గదర్శకత్వం వహిస్తాయి. ఈ విధంగా అన్ని సంస్థలు తమ పరిశోధన సామర్థ్యాలను పెంచుకోవడానికి అవకాశం లభిస్తుంది.

ఎంఏహెచ్ఏ(MAHA) మిషన్: అధిక ప్రభావం ఉన్న రంగాలలో పరిశోధనను ప్రోత్సహించడానికి మిషన్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఇన్ హై-ఇంపాక్ట్ ఏరియాస్(MAHA) ప్రారంభించబడింది. దీని ద్వారా.. క్లిష్టమైన పరిశోధన రంగాలపై దృష్టి సారించడం జరుగుతుంది.

5G: అమెరికాను వెనక్కి నెట్టి.. ప్రపంచంలో రెండో అతిపెద్ద 5జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా భారత్

#Tags