Union Government: ఔరంగాబాద్, ఉస్మానాబాద్‌ల పేర్లు మార్పు

కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రలోని రెండు నగరాల పేర్ల మార్పు నిర్ణయాన్ని ఆమోదించిందని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ తెలిపారు.

ఔరంగాబాద్‌ను ‘ఛత్రపతి శంభాజీ నగర్‌’గా, ఉస్మానాబాద్‌ను ‘ధారాశివ్‌’గా మార్పు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఔరంగాబాద్‌, ఉస్మానాబాద్‌ల పేర్లను మార్చాలనే డిమాండ్‌ను తొలిసారిగా శివసేన అధినేత బాల్‌ థాక్రే తెరపైకి తీసుకొచ్చారు. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే 2022లో తన ప్రభుత్వం కూలిపోయే ముందు తన చివరి క్యాబినెట్ సమావేశంలో ఈ పేర్లను మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పేర్ల మార్పుపై మహారాష్ట్ర క్యాబినెట్ 2022లో నిర్ణయాన్ని ఆమోదించింది కూడా. అయితే దాని ఆమోదం మాత్రం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉండిపోయింది.

Shiv Sena: రూ.2,000 కోట్లతో పార్టీ పేరు, ఎన్నికల గుర్తు కొనుగోలు!

#Tags