Blue Aadhar Card: బ్లూ ఆధార్‌ కార్డు ఎవరికిస్తారు? ఎలా దరఖాస్తు చేయాలి?

భారతదేశంలోని ‍ప్రతీ ఒక్కరికి ఆధార్‌ కార్డు ఎంతో అవసరం. అటు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందాలన్నా, ఇటు విద్యా సంబంధిత విషయాలకైనా ఆధార్‌ తప్పనిసరి. ‘ఆధార్‌’ అనేది దేశంలోని అన్ని ప్రాంతాల్లో చెల్లుబాటు అయ్యే ప్రధాన గుర్తింపు కార్డు అని చెప్పుకోవచ్చు. 

ఆధార్‌ కార్డును దేశంలోని అందరికీ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) జారీ చేస్తుంది. అయితే బ్లూ ఆధార్ కార్డ్ అంటే ఏమిటి? దీనిని ఎవరికి జారీ చేస్తారనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతుంటుంది. ఈ ప్రత్యేక కార్డును దేశంలో ఐదేళ్ల కంటే తక్కువ వయసు కలిగిన పిల్లలకు జారీ చేస్తారు. ఇది నీలి రంగులో ఉన్న కారణంగానే దీనిని బ్లూ ఆధార్ కార్డు అని అంటారు. 

ఐదేళ్లు దాటాక ఆధార్‌ అప్‌డేట్‌

సాధారణ ఆధార్ కార్డుకు ఇది భిన్నంగా ఉంటుంది. పెద్దల మాదిరిగా కాకుండా, పిల్లలకు కార్డులు జారీ చేయడానికి బయోమెట్రిక్ డేటా అవసరం లేదు. దీనికి బదులుగా యూఐడీకి లింక్ అయిన ఆ చిన్నారుల తల్లిదండ్రుల సమాచారం, వారి ఫొటోల ఆధారంగా పిల్లలకు బ్లూ ఆధార్‌ కార్డు జారీ అవుతుంది.

అయితే, పిల్లలకు  ఐదేళ్లు దాటాక ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఫొటో కూడా అవసరమవుతుంది. పిల్లల జనన ధృవీకరణ పత్రం లేదా ఆసుపత్రి డిశ్చార్జ్ స్లిప్‌ను చూపించి నవజాత శిశువుకు సంబంధించిన బాల్ ఆధార్ కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు

#Tags