UNESCO: ప్రపంచంలోని మూడో వంతు హిమానీ నదాలకు ముప్పు
పెరుగుతున్న ఉష్ణోగ్రతలను కట్టడి చేయకపోతే ప్రపంచ వారసత్వ జాబితాలోని మూడో వంతు హిమానీ నదాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని యునెస్కో అధ్యయనం వెల్లడించింది.
పూర్వ పారిశ్రామిక యుగంతో పోల్చితే భూగోళ ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీ సెల్సియస్‌కు మించి పెరగకుంటే మిగిలిన మూడింట రెండో వంతు హిమానీ నదాలను కాపాడొచ్చని పేర్కొంది. ఇది కాప్ (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్)–27 ప్రతినిధులకు పెద్ద సవాలుగా మారనుందని స్పష్టం చేసింది. ఈ సదస్సు ఈజిప్ట్‌లో ఈ నెల 6 నుంచి 18 వరకు జరగనుంది. హిమానీ నదాలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ‘కాప్ 27’ది కీలక పాత్ర అని యునెస్కో పేర్కొంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
#Tags