Cancer Vaccine: క్యాన్సర్‌కు వ్యాక్సిన్.. వచ్చే ఏడాది నుంచే ఉచితంగా అందుబాటులోకి..!
వచ్చే ఏడాదే ఇది అందుబాటు లోకి రానుంది. విశేషం ఏమిటంటే.. ఈ టీకా పూర్తిగా ఉచితం. కొత్త సంవత్సరం ఆరంభంలో క్యాన్సర్ నివారణ టీకాను విడుదల చేయబోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. తమ సొంత ఎంఆర్ఎన్ఏ(mRNA) వ్యాక్సిన్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని రష్యా ఆరోగ్యశాఖకు చెందిన రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ జనరల్ ఆండ్రీ కాప్రిన్ చెప్పారు.
చాలా పరిశోధన సంస్థలు సమిష్టి కృషితో క్యాన్సర్ వ్యాక్సిన్‌ను రూపొందించాయని.. ప్రీ క్లినికల్ ట్రయల్స్‌లో కణతి(ట్యూమర్) పెరుగుదలను అడ్డుకోవడంతో పాటు మెటాస్టాసిస్(వ్యాధికారక ఏజెంట్)ను నిరోధించిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.
ఎలా పని చేస్తుందంటే..
కరోనా నుంచి రక్షణ కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్న కొన్ని టీకాలు మెసెంజర్ ఆర్‌ఎన్‌ఏ (ఎంఆర్‌ఎన్‌ఏ) పోగుల ఆధారంగా పనిచేస్తాయి. అవి కరోనా వైరస్‌ను గుర్తించేలా మానవ రోగనిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తాయి. అలాగే.. రష్యా తయారుచేసిన క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా ఇదే తరహాలో పని చేయనుంది.
Mpox Vaccine: వణికిస్తున్న ఎంపాక్స్ వైరస్‌కు తొలి టీకా అనుమతి
రిబోన్యూక్లియిక్ యాసిడ్(RNA) అనేది.. ఒక పాలీమెరిక్ అణువు, ఇది జీవ కణాలలో చాలా జీవసంబంధమైన విధులకు అవసరం. మెసేంజర్ ఆర్‌ఎన్‌ఏ పీస్‌ను వ్యాక్సిన్ ద్వారా శరీరంలోకి ప్రవేశపెడతారు. తద్వారా కణాలను ఒక నిర్దిష్టమైన ప్రొటీన్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రేరేపిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ ఈ ప్రోటీన్‌ను విదేశీగా(బయటి నుంచి వచ్చిందిగా) గుర్తిస్తుంది. తద్వారా దానితో పోరాడటానికి ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది. అంటే.. కాన్సర్ విషయంలో, రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్ కణాలను గుర్తించి దాడి చేస్తుందన్నమాట.
ఏఐ పాత్ర కూడా..
ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ రూపకల్పనలో ఏఐ పాత్ర ఎంతో ఉందని రష్యా శాస్త్రవేత్తలు ప్రకటించుకున్నారు. పర్సనలైజ్డ్ వ్యాక్సిన్‌లను రూపొందించడానికి.. ఏఐ-ఆధారిత న్యూరల్ నెట్‌వర్క్ గణనలు అవసరమైన సమయాన్ని తగ్గించగలవని, ఈ ప్రక్రియను ఒక గంటలోపే పూర్తి చేయగలదని పేర్కొన్నారు.
ఈ ఏడాది ఆరంభంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. అతిత్వరలో క్యాన్సర్ వ్యాక్సిన్‌తో పాటు తర్వాతి తరానికి రోగనిరోధక శక్తిని పెంపొందించే మందులను ప్రజలకు అందిస్తామన్నారు.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా టీకాను అభివృద్ధి చేసింది. అది గత ఏడాది నుంచే అందుబాటులోకి వచ్చింది.
Dengue Vaccine: డెంగ్యూ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం.. ఎక్కడంటే..