Pope Francis: ఎన్నికవగానే.. రాజీనామా లేఖ రాసిచ్చిన పోప్‌ ఫ్రాన్సిస్‌

డిసెంబర్‌ 17న 86వ ఏట అడుగు పెట్టిన పోప్‌ ఫ్రాన్సిస్‌ కొన్నేళ్లుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు.

ఆయనకు 2021లో పేగు శస్త్రచికిత్స జరిగింది. మోకాలి నొప్పి తీవ్రంగా బాధించడంతో కొద్ది నెలలు వీల్‌చైర్‌కు పరిమితమయ్యారు. ఆయన ఓ వార్తా పత్రికతో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు తదితరాల వల్ల పోప్‌ విధులు నిర్వర్తించలేకపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా ఇలా వెల్లడించారు. ఆనారోగ్య కారణాలతో విధులు నిర్వర్తించలేని పరిస్థితి ఎదురైతే ఏం చేయాలన్న ఆలోచన తనకు ఎప్పుడో వచ్చిందని పోప్‌ ఫ్రాన్సిస్‌ తెలిపారు. ‘‘అందుకే పోప్‌గా ఎన్నికైన వెంటనే రాజీనామా లేఖ రాసి కార్డినల్‌ టార్సిసియో బెర్టోనే చేతికిచ్చా. నేను విధులు నిర్వర్తించలేని పరిస్థితి ఎదురైతే పనికొస్తుందని చెప్పా’’ అని చెప్పారు.  

Weekly Current Affairs (International) క్విజ్ (18-24 నవంబర్ 2022)

వృద్ధాప్య కారణాలతో గతంలోపోప్‌ బెనెడిక్ట్‌ రాజీనామా 
ఫ్రాన్సిస్‌కు ముందు పోప్‌గా ఉన్న బెనెడిక్ట్‌–16 రాజీనామా చేశారు. వృద్ధాప్యం వల్ల బాధ్యతలను సరిగా నిర్వర్తించ లేకపోతున్నానంటూ ఆయన 2013లో రాజీనామా చేసి తప్పుకున్నారు. గత 600 ఏళ్లలో  ఇలా బాధ్యతల నుంచి తప్పుకున్న తొలి పోప్‌గా రికార్డు సృష్టించారు. అనంతరం ఫ్రాన్సిస్‌ పోప్‌గా ఎన్నికయ్యారు. 

Aquarium Breaks: ప్రపంచంలోని అతి పెద్ద అక్వేరియం బద్దలు!

#Tags