Skip to main content

Aquarium Breaks: ప్రపంచంలోని అతి పెద్ద అక్వేరియం బద్దలు!

ప్రపంచంలోకెల్లా అతి పెద్దదిగా గిన్నిస్‌ రికార్డులో ఎక్కిన అక్వేరియం ఉన్నఫ‌లంగా బద్దలైంది.

దీంతో అందులోని 1,500 చేపలు చనిపోవడంతో పాటు ఏకంగా 10 లక్షల లీటర్ల పై చిలుకు నీళ్లు అక్వేరియమున్న హోటల్‌తో పాటు పరిసర వీధులనూ ముంచెత్తాయి. అక్వాడాం అని పిలిచే సిలిండర్‌ ఆకృతిలోని ఈ 46 అడుగుల ఎత్తైన అక్వేరియం జర్మనీలోని బెర్లిన్‌లో రాడిసన్‌ బ్లూ హోటల్‌లో ఉంది. 2003 నుంచి సందర్శకులను అలరిస్తోంది. దీని నిర్మాణానికి రూ.100 కోట్లకు పైగా ఖర్చయింది. ఇది బెర్లిన్‌లో అతి పెద్ద పర్యాటక ఆకర్షణగా మారింది. ఇందులో 10 నిమిషాల లిఫ్ట్‌ ప్రయాణం అద్భుతమైన అనుభూతిని ఇస్తుంద‌ని సందర్శకులు చెబుతుంటారు. రెండేళ్ల క్రితం దీన్ని ఆధునీకరించారు. ఉష్ణోగ్రతలు మైనస్‌ 10 డిగ్రీలకు పడిపోయినందుకే అక్వేరియం బద్దలై ఉంటుందని భావిస్తున్నారు.

Weekly Current Affairs (International) క్విజ్ (18-24 నవంబర్ 2022)

Published date : 17 Dec 2022 02:53PM

Photo Stories