G20 Summit: బ్రెజిల్‌లో జీ20 శిఖరాగ్ర సదస్సు

జీ20 శిఖరాగ్ర సదస్సు నవంబర్ 18వ తేదీ బ్రెజిల్‌లోని రియో డిజనిరోలో ప్రారంభమైంది.

రెండు రోజుల పాటు జ‌రిగే జీ20 శిఖరాగ్ర సదస్సులో.. తొలి రోజున, ప్రధాని నరేంద్ర మోదీ ఆకలి, పేదరికంపై పోరు, సోషల్ ఇంక్లూజన్ అంశాలపై ప్రసంగించారు. ఆయన గ్లోబల్ సౌత్ (దక్షిణార్ధ గోళం) దేశాలు ఎదుర్కొంటున్న కష్టాలు, ముఖ్యంగా యుద్ధాలు, ఆహార, ఇంధన, ఎరువుల సంక్షోభాల కారణంగా అవి తీవ్రంగా పతనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం జీ20 కూటమి వెంటనే చర్యలు తీసుకోవాలని మోదీ ఆకాంక్షించారు.

మోదీ గ్లోబల్ సౌత్ దేశాలకు ప్రాధాన్యం ఇచ్చే చర్యల్లో భాగంగా, ఢిల్లీ శిఖరాగ్రంలో ఆఫ్రికన్ యూనియన్‌ను జీ20లో శాశ్వత సభ్యత్వం కల్పించడం, ప్రపంచవ్యాప్తంగా సుస్ధిరాభివృద్ధి లక్ష్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి నిర్ణయాలు తీసుకున్న విషయాలను గుర్తుచేశారు. “ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిత” అనే ఆధ్యాత్మిక దృక్పథంతో సదస్సు సాగాలని పిలుపునిచ్చారు.

Asia-Pacific Conference: ఢిల్లీలో ‘ఆసియా–పసిఫిక్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ జర్మన్‌ బిజినెస్‌’ సదస్సు

భారత్‌లో పేదరికం, ఆకలి సమస్యలపై తీసుకుంటున్న చర్యలను వివరించారు. 80 కోట్ల మందికి ఉచిత ఆహారధాన్యాల పంపిణీ, ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య బీమా, పంట బీమా, పంట రుణ పథకాలు వంటి చర్యల ద్వారా 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడినట్టు తెలిపారు. ఈ కార్యక్రమాలను గ్లోబల్ సౌత్ మరియు ఇతర దేశాలు అనుసరిస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చని మోదీ అన్నారు.

ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కూడా భేటీ అయ్యారు. ఈ భేటీతో, మోదీ-బైడెన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత ఇద్దరి మధ్య ఇది మొదటి భేటీగా నమోదైంది.

BRICS Summit 2024: రష్యాలో జరిగిన 16వ బ్రిక్స్ సదస్సు.. దీని ముఖ్యాంశాలు ఇవే..

#Tags