Anti-Air Missiles: ఉత్తర కొరియా చేతికి రష్యన్‌ గగనతల రక్షణ క్షిపణులు

ఉక్రెయిన్‌ యుద్ధం పరోక్షంగా ఉత్తర కొరియా, రష్యాల రక్షణ బంధాన్ని మరింత బలోపేతం చేస్తోంది.

ఉక్రెయిన్‌ యుద్ధక్షేత్రాల్లో పాల్గొనేందుకు 10 వేల మంది ఉత్తరకొరియా సైనికులు అక్టోబర్‌లో రష్యాకు తరలివెళ్లింది. ఉత్తరకొరియా సాయానికి బదులుగా రష్యా సైతం పెద్ద సాయమే చేసిందని దక్షిణకొరియా న‌వంబ‌ర్ 22వ తేదీ ప్రకటించింది.

గగనతల రక్షణ క్షిపణులను ఉత్త‌ర కొరియాకు రష్యా అందించిందని దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్‌సుక్‌కు జాతీయ భద్రతా సలహాదారు షిన్‌ వోన్సిక్ వెల్లడించారు. 
 
ఈ మేరకు ఎస్‌బీసీ టీవీ కార్యక్రమంలో షిన్‌ మాట్లాడారు. ఉ.కొరియా గగనతల రక్షణ వ్యవస్థలో వాడే క్షిపణులను రష్యా సరఫరా చేసింది. వీటితోపాటు ఇతర ఉపకరణాలనూ ఉ.కొరియాకు పంపించింది. తమను ద్వేషించేలా దేశ వ్యతిరేక కరపత్రాలను తమ దేశంలోనే డ్రోన్ల ద్వారా జారవిడుస్తున్నారని, ఇది పునరావృతమైతే క్షిపణి దాడులు తప్పవని ఉ.కొరియా ఇటీవల ద.కొరియాను హెచ్చరించిన విషయం విదితమే. అయితే ఈ కరపత్రాలతో తమకు ఎలాంటి సంబంధంలేదని ద.కొరియా స్పష్టం చేసింది.

Ballistic Missile: ఉక్రెయిన్‌పైకి ఖండాంత‌ర క్షిప‌ణి.. ఇదే తొలిసారి..!

#Tags