NASA : చంద్రునిపై శాశ్వత మానవ ఆవాసం దిశగా నాసా ప్ర‌య‌త్నాలు

చంద్రునిపై ఆక్సిజన్‌ను కంప్రెస్డ్‌ గ్యాస్, లేదా ద్రవ రూపంలో ట్యాంకుల్లో బాట్లింగ్‌ చేయాలన్నది నాసా ప్రణాళిక.

చంద్రునిపై శాశ్వత మానవ ఆవాసం దిశగా ప్రయత్నాలను నాసా ముమ్మరం చేస్తోంది. ఇందుకు ఉద్దేశించిన ఆర్టెమిస్‌ ప్రోగ్రాంపై ఇప్పటికే భారీగా ఖర్చు చేసింది కూడా. అందులో భాగంగా దక్షిణ ధ్రువంపై ఆక్సిజన్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని అమెరికా అంతరిక్ష సంస్థ తాజాగా తలపోస్తోంది. దీన్ని ల్యూనార్‌ సౌత్‌పోల్‌ ఆక్సిజన్‌ పైప్‌లైన్‌ (ఎల్‌–ఎస్‌పీఓపీ)గా పిలుస్తున్నారు.

Erupting Volcanoes : చందమామ ఆవలి వైపు కూడా అగ్నిపర్వతాలకు నిల‌య‌మే.. శాస్త్ర‌వేత్త‌ల నిర్ధార‌ణ!

చంద్రుని ఉపరితలంపై ఆక్సిజన్‌ రవాణాకు సంబంధించిన రిస్కులను, ఖర్చులను భారీగా తగ్గించుకోవడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఎందుకంటే చంద్రుని ఉపరితలం మీది రాతి నిక్షేపాల నుంచి ఆక్సిజన్‌ను వెలికితీయాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే నీటి అవసరాలను చంద్రునిపై అపారంగా పరుచుకున్న మంచుతో తీర్చుకోవాలని యోచిస్తోంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

ఎలా చేస్తారు?

చంద్రునిపై ఆక్సిజన్‌ను కంప్రెస్డ్‌ గ్యాస్, లేదా ద్రవ రూపంలో ట్యాంకుల్లో బాట్లింగ్‌ చేయాలన్నది నాసా ప్రణాళిక. కాకపోతే వాటి రవాణా పెను సవాలుగా మారనుంది. ఆక్సిజన్‌ను దాని వెలికితీత ప్రాంతం నుంచి సుదూరంలో ఉండే మానవ ఆవాసాలకు తరలించేందుకు అత్యంత వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చని భావిస్తున్నారు. ఇందుకోసం తొలి దశలో కనీసం 5 కి.మీ. పొడవైన పైప్‌లైన్‌ నిర్మించాలన్నది ప్రాథమిక ప్రణాళిక. దీన్ని చంద్రునిపై అందుబాటులో ఉండే అల్యుమి నియం తది తరాల సాయంతోనే పూర్తి చేయాలని నాసా భావిస్తోంది.

Minister of Health : ప్రజారోగ్యం విషయంలో ట్రంప్ కీలక నిర్ణ‌యం.. మ‌రో మంత్రిగా..!

→ ఈ పనుల్లో పూర్తిగా రోబోలనే వాడనున్నారు.
→ మరమ్మతుల వంటివాటిని కూడా రోబోలే చూసుకుంటాయి
→ పైప్‌లైన్‌ ద్వారా ఆక్సిజన్‌ గంటకు రెండు కి.మీ. వేగంతో ప్రవహిస్తుంది
→ ప్రాజెక్టు జీవితకాలం పదేళ్లని అంచనా 
Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags