Earthquake in Vanuatu: పసిఫిక్ ద్వీప దేశం.. వనౌటులో భారీ భూకంపం
పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో డిసెంబర్ 17వ తేదీ భారీ భూకంపం సంభవించింది.
రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదైన ఈ భూకంపం తాకిడి తీవ్ర నష్టం సంభవించింది. పోర్ట్ విలాలోని వివిధ దేశాల దౌత్యకార్యాయాలున్న భవన సముదాయం సహా నేల మట్టమైన పలు భవనాల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్ష మయ్యాయి. పోర్ట్ విలాలోని నౌకాశ్రయం దెబ్బతింది. అక్కడి విమానాశ్రయంలో రాకపోకలు నిలిచిపోయాయి.
పోర్ట్ విలా దౌత్య కార్యాలయంలోని తమ సిబ్బంది అందరూ సురక్షి తంగానే ఉన్నారని, ప్రస్తుతానికి కార్యాలయాన్ని మూసి వేశామని అమెరికా, ఆస్ట్రేలియా తెలిపాయి.
పోర్ట్ విలాకు 30 కిలోమీటర్ల దూరంలో భూమికి 37 కిలోమీటర్ల లోతులో ఒక్కసారిగా తీవ్ర ప్రకంపనలు మొదలయ్యాయి. అనంతర ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైంది.
#Tags