PM Modi : భార‌త ప్ర‌ధానికి మ‌రో అరుదైన గౌర‌వం..!

సాంటో డొమింగో: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. కరేబియన్‌ దేశం కామన్వెల్త్‌ ఆఫ్‌ డొమినికా తమ దేశ అత్యున్నత జాతీయ అవార్డును ఆయనకు అందించింది.  విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ గుయానా చేరుకున్నారు. అక్కడ డొమెనికా అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ ఆయనన్ని కలిశారు. 

India-Guyana Relations: గయానాతో 10 ఒప్పందాలు కుదుర్చుకున్న మోదీ..

ఈ సందర్భంగా.. ‘డొమినికా అవార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌’ తో మోదీని  డొమెనికా అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్‌ సత్కరించారు. కరోనా టైంలో తమ దేశానికి మోదీ నేతృత్వంలో భారత్‌ అందించిన సహకారం.. అందులో ఆయన పాత్రను బర్టన్‌ ఈ సందర్భంగా కొనియాడారు. అలాగే..
 

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)
ఈ అవార్డును భారతీయ సోదర సోదరీమణులకు అంకితం ఇస్తున్నానని ఎక్స్‌లో ఆయన పోస్ట్‌ చేశారు. మరోవైపు జార్జ్‌టౌన్‌లో డొమెనికా ప్రధాని రూజ్‌వె స్కెర్రిట్‌తో మోదీ ప్రత్యేకంగా సమావేశమై ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చించారు. 1981 నుంచి ఈ రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇంతకు ముందు.. 2019లో ఇండి-క్యారీకామ్‌లో భాగంగా మోదీ-స్కెర్రిట్‌ న్యూయార్క్‌లోనూ భేటీయ్యారు. కరోనా టైంలో ఈ దేశానికి భారత్‌ వ్యాక్సిన్‌ సహకారం అందించింది కూడా.

#Tags