India-China: భారత్-చైనాల మధ్య విమానాల రాకపోకలు పునఃప్రారంభం
బ్రెజిల్‌లో జరిగిన జీ20 సదస్సులో భారత విదేశాంగ మంత్రి జై శంకర్, చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యిల మధ్య జరిగిన సమావేశం శాంతి చర్చలకు దారితీసింది. ఈ సమావేశంలో ముఖ్యంగా రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాలను పునరుద్ధరించడమే కాకుండా, కైలాష్ మానసరోవర్ యాత్రను పునఃప్రారంభించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
తూర్పు లద్దాఖ్‌లోని డెమ్‌చోక్ సెక్టార్‌లో భారత బలగాల పెట్రోలింగ్ ప్రారంభం తరువాత, ఈ రెండు దేశాల మధ్య జరిగిన తొలి ఉన్నత స్థాయి సమావేశం ఇదే. ఈ సమావేశం శాంతి మరియు ప్రశాంతతను కాపాడేందుకు ఒక దశాబ్ధ కాలంలో జరిగిన కీలక చర్చగా భావిస్తున్నారు.
G20 Summit: జీ20 సదస్సులో మోదీ భేటీ అయిన నేతలు వీరే..
2020 జూన్ 15న, తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో, భారత్‌లో 20 మంది సైనికులు వీరమరణం పొందగా, చైనా కూడా భారీగా సైనికుల్ని కోల్పోయింది. ఈ ఘర్షణ తరువాత, రెండు దేశాలు తీవ్రమైన ఉద్రిక్తతలను ఎదుర్కొన్నాయి.
కానీ తాజాగా, ఈ ఉద్రిక్తతలు తగ్గించుకునేందుకు వీలుగా భారత్-చైనా కీలక గస్తీ ఒప్పందం కుదుర్చుకున్నాయి, ఇది పలు సంవత్సరాలుగా కొనసాగుతున్న వివాదాన్ని నివారించేందుకు తీసుకున్న ఒక ముందడుగు.
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి వెయ్యి రోజులు