Ismail Haniyeh: పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య!

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో గ్లోబల్ టెర్రరిస్ట్, పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ రాజకీయ చీఫ్ ఇస్మాయిల్ హనియే(62) వైమానిక దాడిలో హత్యకు గురయ్యారు.

జూలై 30వ తేదీ రాత్రి టెహ్రాన్లో ఇరాన్‌ నూతన అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ముగించుకుని ఇస్మాయిల్ హనియే టెహ్రాన్‌లోని తన ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ హత్య జరిగింది. ఇందులో హనియే బాడీగార్డు కూడా చనిపోయిన‌ట్లు హమాస్‌ ధ్రువీకరించింది.  

హెచ్చరించినట్టుగానే.. 
గతేడాది అక్టోబరు 7న తన గడ్డపై హమాస్‌ నరమేధానికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్‌ యుద్ధానికి దిగ్గింది. హనియేతో పాటు హమాస్‌ అగ్ర నేతలందరినీ మట్టుబెట్టి తీరతామని ఆ సందర్భంగానే ప్రతిజ్ఞ చేసింది. హమాస్‌ నేతలు ఎక్కడున్నా వెంటాడి వేటాడాలంటూ ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ మొసాద్‌కు బాహాటంగానే అధ్యక్షుడు బెంజమిన్‌ నెతన్యాహూ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్‌ 7 నాటి దాడిలో హనియేకు నేరుగా పాత్ర లేదు. పైగా హమాస్‌లో మితవాద నేతగా ఆయనకు పేరుంది. అయినా నాటి దాడికి ఆయన ఆశీస్సులూ ఉన్నాయని ఇజ్రాయెల్‌ నమ్ముతోంది. 

Maldives President: భారత్‌కు కృతజ్ఞతలు తెలిపిన మాల్దీవుల అధ్యక్షుడు.. ఎందుకంటే..

శరణార్థి నుంచి హమాస్‌ చీఫ్‌ దాకా.. 
ఇస్మాయిల్‌ హనియే గాజా సమీపంలో శరణార్థి శిబిరంలో 1962లో జన్మించారు. 1987లో మొదటి పాలస్తీనా యుద్ధ సమయంలో పుట్టుకొచ్చిన హమాస్‌లో ఆయన వ్యవస్థాపక సభ్యుడు. సంస్థ వ్యవస్థాపకుడు, తొలి చీఫ్‌ అహ్మద్‌ యాసిన్‌కు అత్యంత సన్నిహితుడు. 2004లో ఇజ్రాయెల్‌ దాడుల్లో యాసిన్‌ మరణించాక హమాస్‌లో కీలకంగా మారారు. ఉర్రూతలూగించే ప్రసంగాలకు పెట్టింది పేరు.

2006లో పాలస్తీనా ప్రధానిగా గాజా పాలన చేపట్టారు. ఏడాదికే పాలస్తీనా నేషనల్‌ అథారిటీ అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌ ఆయన్ను పదవి నుంచి తొలగించారు. నాటినుంచి గాజాలో ఫతా–హమాస్‌ మధ్య పోరు సాగుతోంది. అబ్బాస్‌ ఆదేశాలను బేఖాతరు చేస్తూ హనియే గాజా ప్రధానిగా కొనసాగుతున్నారు. 2017లో హమాస్‌ చీఫ్‌ అయ్యారు. 

US Biosecure Act: అమెరికా చట్టం.. భారత్‌కు లాభం..!

#Tags