Global Risk Report 2024: తప్పుడు సమాచారం అతిపెద్ద ముప్పు

భారత్, అమెరికా, బ్రిటన్‌ , మెక్సికో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. దాదాపు 300 కోట్ల మంది ఎన్నికల క్రతువులో భాగం కానున్నారు. అయితే తప్పుడు సమాచార వ్యాప్తి ఎన్నికలకు పెను ముప్పుగా పరిణమించిందని, ఆయా దేశాల్లో ఎన్నికల ఫలితాలపైనా, ప్రజాస్వామ్య మనుగడపైనా ఇది తీవ్ర ప్రభావం చూపించనుందని ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్‌) ‘గ్లోబల్‌ రిస్క్‌ నివేదిక–2024’ ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక, పర్యావరణ, రాజకీయ, భౌగోళిక, సాంకేతిక తదితర 34 ముప్పులపై నివేదిక ర్యాంకులను ప్రకటించింది. తప్పుడు సమాచారం అతిపెద్ద ముప్పుగా ఉన్న దేశాల్లో భారత్‌ తొలిస్థానంలో ఉంది. అమెరికా ఆరో స్థానంలో ఉంది.

#Tags