Work Hours: విదేశీ విద్యార్థులకు వారానికి 24 గంటలే పని.. ఎక్క‌డంటే..!?

కెనడాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల పని గంటలపై ఆ దేశం పరిమితులు విధించింది.

విదేశీ విద్యార్థులు వారానికి 24 గంటలు మాత్రమే పనిచేయాలని ఇమ్మిగ్రేషన్‌ మంత్రి మార్క్‌ మిల్లర్‌ ప్రకటించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..'వివిధ అంశాలను పరిగణలోనికి తీసుకొని ఈ నిబంధనను తీసుకొచ్చాం. 80 శాతం కంటే ఎక్కువ మంది విద్యార్థులు వారానికి  20 గంటల కంటే ఎక్కువే పనిచేస్తున్నారు. ఇది వారి చదువుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఎక్కడెక్కడి నుంచో కెనడాకు చదువుల కోసం వస్తుంటారు. అలాంటిది ఆఫ్-క్యాంపస్ ఉపాధి కోసం విద్యార్థులు పరిమితికి మించి పనిచేయడం వల్ల విద్యార్థులు చదువపై కంటే పనిపైనే ఎక్కువగా ఫోకస్‌ చేయాల్సి వస్తుంది. అందుకే పనిగంటలను కుదిస్తూ నిర్ణయం తీసుకున్నాం' అని ఆయన పేర్కొన్నారు.

కొత్త వర్క్ పర్మిట్ మార్గదర్శకాల ప్రకారం.. విద్యార్థులు వారానికి 24 గంటలే పనిచేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అయితే సమ్మర్‌ బ్రేక్స్‌ వంటి సమయాల్లో పని గంటలపై ఎలాంటి పరిమితి లేదు. విదేశీ విద్య కోసం చూసే భారత యువతకు కెనడా ప్రధాన గమ్యస్థానంగా ఉంటోంది. 2022లో కెనడా ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఆ దేశంలో 3,19,130 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. 

#Tags