National Bird of America : రెండు వంద‌ల ఏళ్ల త‌రువాత అమెరికా జాతీయ ప‌క్షిగా బాల్డ్‌ ఈగల్‌..

అమెరికా జాతీయ పక్షిగా ‘బాల్డ్‌ ఈగల్‌’ను గుర్తిస్తూ.. ఆ దేశ సెనెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 240 ఏళ్లుగా ఈ పక్షిని అమెరికాలో అధికార చిహ్నంగా వాడుకున్నారు. అమెరికా దేశం ఏర్పడినప్పుడు ఆ దేశ రూపకర్తలు ‘బాల్డ్‌ ఈగల్‌’నే గుర్తుగా ఎంచుకున్నారు. 1940లో ఈ పక్షుల్ని వేటాడటంపై నిషేధం విధించారు. జాతీయ పక్షి హోదా మాత్రం ఇప్పటివరకు దక్కలేదు. రెండు వందల ఏళ్లకుపైగా ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ.. సెనెట్‌(పార్లమెంట్‌ ఎగువ సభ) జాతీయ పక్షిని తాజాగా ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు ఎట్టకేలకు ఆమోదం లభించింది.

World Bank Report : ఈ దేశాలు అధికాదాయంగా మార‌డంపై ప్రపంచ బ్యాంక్‌ తాజా నివేదిక..

#Tags