America Population: 34 కోట్లకు చేరిన అమెరికా జనాభా

ఈ ఏడాది అమెరికా జనాభా 34 కోట్లకు చేరుకుంది.

విదేశీయుల వలస కారణంగా దేశంలో జనాభా వృద్ధిరేటు గత 23 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. 2001 తర్వాత ఈ సంవత్సరం నమోదైన 1% జనాభా వృద్ధిరేటు 23 ఏళ్లలో అత్యధికం కావడం విశేషం. అమెరికా జనాభా లెక్కలను ప్రభుత్వం ప్రకటించింది. 

2021లో కరోనా మహమ్మారి కారణంగా వలసలు తగ్గడంతో 0.2% వృద్ధిరేటు మాత్రమే నమోదైంది. కానీ ఈ ఏడాది వలసల కారణంగా 28 లక్షల మంది జనాభా పెరిగింది. మొత్తం జనాభా 33 లక్షల మందితో పెరిగినందులో 84% వృద్ధి వలసల వల్లే నమోదైంది.

2023-24 సంవత్సరంలో మరణాల కంటే జననాలు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ కాలంలో 5,19,000 మంది జన్మించారు. 2022లో 17 లక్షలు, 2023లో 2.3 లక్షలు జనాభా పెరిగినట్లు అధికారులు తెలిపారు.

Indian Population : 2036 నాటికి  భారత జనాభా 152 కోట్లు!

#Tags