UNESCO World Heritage Site : యునెస్కో వారసత్వ సంపదగా అహోమ్ సమాధులు..
అహోమ్ చక్రవర్తుల సమాధులకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు లభించింది. ఈశాన్య అస్సాంలో ఉన్న ఈ ప్రాంతం.. కల్చరల్ ప్రాపర్టీ కేటగిరీలో యునెస్కో గుర్తింపు పొందింది. ఈజిప్టు పిరమిడ్స్ తరహాలో తూర్పు అస్సాంను పాలించిన అహోమ్ చక్రవర్తులు ఇక్కడ తమ పూర్వీకుల సమాధులను కట్టారు. ‘చరాయిడియో మైదమ్’ను చక్రవర్తుల ఖనన ప్రదేశంగా పిలుస్తారు. మైదమ్ అంటే పుట్ట తరహాలో భూమిపై ఎత్తుగా ఉంటుంది.
United Nations: ఐక్యరాజ్యసమితిలో రామకథా పారాయణం
తూర్పు అస్సాం ప్రాంతాన్ని సుమారు 600 ఏళ్ల పాటు అహోమ్ రాజులు పాలించారు. బ్రిటీషర్ల రాకకు పూర్వం ఇక్కడ ఆ రాజుల పాలనే ఉండేది. పిరమిడ్స్ తరహాలో ఇక్కడ సమాధులను నిర్మించారు. తాజాగా వీటికి గుర్తింపుతో భారత్‌లో యునెస్కో వారసత్వ గుర్తింపు పొందిన ప్రాంతాల సంఖ్య 43కి చేరింది.
#Tags