India-Japan relations: ఇండియా-జపాన్‌ 70ఏళ్ల సంబంధాలు

రక్షణ రంగంలో సహకారాన్ని మరింత పెంచుకోవాలని భారత్, జపాన్‌ లు నిర్ణయించుకున్నాయి. జపాన్‌ పర్యటనలో భాగంగా భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆ దేశ రక్షణ మంత్రి యసుకజు హమదాతో చర్చలు జరిపారు. ఇరు దేశాల సైన్యాల మధ్య సమన్వయం మరింతగా పెరిగేందుకు వీలుగా తొలిసారిగా రెండు దేశాలు అధునాతన యుద్ధవిమానాలతో కూడిన సంయుక్త సైనిక విన్యాసాలకూ ఆమోదం తెలిపారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛాయుత, వ్యూహాత్మక ఒప్పందాలు చైనా దూకుడుకు అడ్డుకట్ట వేస్తాయని భారత్, జపాన్‌ భావిస్తున్న తరుణంలో.. ఇరు దేశాల రక్షణ మంత్రుల భేటీ జరగడం గమనార్హం.'రెండు దేశాల మధ్య దౌత్యసంబంధాలు మొదలై 70ఏళ్లు పూర్తవుతున్న ఈ సందర్భంగా ద్వైపాక్షిక చర్చలు జరిగాయి' అని రాజ్‌నాథ్‌ ట్వీట్‌ చేశారు. భారత రక్షణ రంగంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాలని జపాన్‌ పరిశ్రమలను ఆయన కోరారు. భారత్‌-జపాన్‌ 2+2 మంత్రుల భేటీలో భాగంగా జపాన్‌ విదేశాంగ మంత్రి యొషిమస హయషితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ చర్చలు జరిపారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags