Starvation Deaths: ఆకలి కారణంగా నిమిషానికి ఎంత మంది మరణిస్తున్నారు?

కరోనా, అంతర్గత అస్థిర రాజకీయ పరిస్థితులు, కరువు కాటకాలు వంటి వాటివల్ల ప్రపంచంలో చాలా దేశాలలో ఆకలి చావులు అధికంగా ఉన్నాయనీ, కరోనా వైరస్‌ ప్రభావంతో పరిస్థితులు మరింత దిగజారాయనీ పేదరిక నిర్మూలన కోసం కృషి చేసే ‘ఆక్స్‌ఫామ్‌’ సంస్థ వెల్లడించింది. ఆకలి కార ణంగా ప్రపంచంలో ప్రతి నిమిషానికి 11 మంది చనిపోతున్నారని ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఆకలితో మరణించిన వారి సంఖ్య ఆరు రెట్లు ఎక్కువగా వుంది అని అంచనా వేసింది. ఈ మేరకు తాజగా ‘ది హంగర్‌ ముల్టిప్లయిస్‌’అనే పేరుతో నివేదికను విడుదల చేసింది. 2021 ఏడాదికిగాను రూపొందించిన ఈ నివేదికను పరిశీలిస్తే... 

  • ప్రపంచ జనాభాలో 10 శాతం జనాభా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. 30 శాతం జనాభాకు తగిన ఆహారం దొరకడం లేదు.
  • అదనంగా 11 కోట్ల మంది ప్రజలు ఆకలి కోరల్లో చిక్కుకోవడం, ప్రజా పంపిణీ వ్యవస్థ వైఫల్యం, లోపభూయిష్ఠమైన ఆహారభద్రత విధానం, నిరుద్యోగం, ఆహార కొరతల కారణంగా గత ఏడాదితో పోలిస్తే ఆకలితో మరణించిన వారి సంఖ్య అధికమైంది.
  • ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారత్‌ స్వయం సమృద్ధి దశకు చేరినా పోషకాహార లోపంతో బాధపడుతున్న జనాభా 2018లో 13.8 శాతం ఉండగా...  2020 నాటికి 15.3 శాతానికి పెరిగింది.
  • భారత్‌లో ఆహారధాన్యాల ఉత్పత్తిలో మిగులు సాధించినప్పటికీ నిరుద్యోగం, పేదరికం వల్ల ప్రజల కొనుగోలు శక్తి ఆశించిన మేరకు పెరగలేదు. 
  • భారత్‌లో దాదాపు 14 శాతం ప్రజలు పోషకాహార లోపంతో, ఐదేళ్ల లోపు వయస్సున్న పిల్లలు 20 శాతం తక్కువ బరువుతో ఉన్నారు. 15–49 ఏళ్ల లోపు మహిళల్లో 52 శాతం రక్తహీనతతో సతమతమౌతున్నారు.
  • 2021 ప్రపంచ ఆకలి సూచీ జాబితాలో 116 దేశాలను చేర్చారు. ఇందులో భారతదేశం అట్టడుగున 101వ స్థానంలో ఉంది. 2020లో భారతదేశం స్థానం 94 కాగా, 2021 నాటికి 101 స్థాయికి దిగజారింది.

3500 Year Old Menhir: ఇనుపయుగం నాటి భారీ మెన్హిర్‌ను ఎక్కడ గుర్తించారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ప్రతి
నిమిషానికి 11 మంది చనిపోతున్నారు
ఎప్పుడు : మార్చి 13
ఎవరు    : ఆక్స్‌ఫామ్‌ సంస్థ విడుదల చేసిన ది హంగర్‌ ముల్టిప్లయిస్‌ నివేదిక
ఎక్కడ    : ప్రపంచంలో..
ఎందుకు : ఆకలి కారణంగా..

Russia-Ukraine War: శరణార్థులకు ఆశ్రయమిస్తే భత్యం అందజేస్తామని ప్రకటించిన దేశం?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags