Elimination of Racial Discrimination: జాతి వివక్ష.. 1960, మార్చి 21న ఆరోజు జరిగిన సంఘటనే..

సమాజంలో అనాదిగా రకరకాల వివక్షలు కొనసాగుతున్నాయి. అందరూ సమానమే అయినప్పటికీ కుల, మత, ప్రాంత, లింగ బేధాలతో సరైన గుర్తింపు లేకుండా వివక్షకు గురవుతున్నారు. ఆధునిక కాలంలోనూ ఇంకా వివక్ష కొనసాగుతుంది. దీన్ని నిర్మూలించేందుకు ప్రతి ఏడాది మార్చి 21న జాతి వివక్ష నిర్మూలన దినోత్సవంగా పాటిస్తాము.

జాతి వివక్ష, బానిసత్వం ఎన్నో తరాలను ప్రభావితం చేయడమే కాకుండా వారి హక్కులు, స్వేచ్చలను హరించివేస్తుంది. అందుకే జాతి వివక్షను నిర్మూలించాలి. జాతి వివక్ష వ్యతిరేకకు ఏ ప్రత్యేక చరిత్ర ఉంది. 1960 మార్చి 21న దక్షిణాఫ్రికాలోని షార్ప్‌విల్లేలో ఒక దుర్ఘటన జరిగింది.

జాతి వివక్ష.. చరిత్ర ఇదే

జాతి వివక్షకు వ్యతిరేకంగా శాంతియుతంగా ప్రజలు ర్యాలీ నిర్వహిస్తుంటే పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో 69 మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఈ రోజును జాతి వివక్ష వ్యతిరేక రోజుగా జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు 1966లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

అప్పట్నుంచి మార్చి 21న జాతి వివక్ష వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది  “ఏ డికేడ్ ఆఫ్ రికగ్నిషన్, జస్టిస్ మరియు డెవలప్‌మెంట్: ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ డికేడ్ ఫర్ పీపుల్ ఆఫ్ ఆఫ్రికన్” థీమ్.  
 

#Tags