Repo Rate: తొమ్మిదవ సారి మారని రెపో రేటు.. ప్ర‌స్తుతం ఎంతుందో తెలుసా..

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(RBI) కీలక రేట్లలో మార్పులు చేర్పులు చేయకుండా యథాతథంగా కొనసాగించింది.

పరపతి విధాన కమిటీ సమావేశం ఆగస్టు 8వ తేదీ జరిగింది. ఇందులో ఆర్‌బీఐ (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ ద్రవ్య విధాన నిర్ణయాన్ని ప్రకటించారు. కాబట్టి రేపో రేటు 6.5 శాతం వద్ద ఉంది. రెపో రేటును యథాతథంగా కొనసాగించడం ఇది తొమ్మిదవ సారి. మానిటరీ పాలసీ కమిటీ (MPC) తన మూడవ ద్వైమాసిక విధాన సమావేశాన్ని ఆగస్టు 6 నుంచి ఆగస్టు 8 వరకు నిర్వహించింది. 

రెపో రేటు..
ఆర్‌బీఐ నుంచి ఇతర బ్యాంకులు (వాణిజ్య బ్యాంకులు) రుణాలు తీసుకుంటాయి. ఆ సమయంలో ఆర్‌బీఐ అలంటి బ్యాంకుల నుంచి వడ్డీ వసూలు చేస్తుంది. దీనినే రేపో రేటు అంటారు. ఈ రెపో రేటు దేశ ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్థారిస్తారు. రేపో రేటు తక్కువగా ఉన్నప్పుడు ఆర్‌బీఐ బ్యాంకుల నుంచి కూడా తక్కువ వడ్డీని వసూలు చేస్తుంది. ఇది వాణిజ్య బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్న వారి మీద ప్రభావం చూపిస్తుంది.

రివర్స్ రెపో రేటు..
వాణిజ్య బ్యాంకుల వద్ద ఎక్కువ డబ్బు ఉన్నపుడు ఆర్‌బీఐకు రుణాల రూపంలో ఇవ్వవచ్చు. అప్పుడు ఆర్‌బీఐ వాణిజ్య బ్యాంకులకు వడ్డీ ఇస్తుంది. దీనిని రివర్స్ రెపో రేటు అంటారు. అయితే ఈ వడ్డీ రెపో రేటు కంటే తక్కువగా ఉంటుంది. 2011కు ముందు రివర్స్ రేపో రేటును.. రేపో రేటుతో సంబంధం లేకుండా నిర్ణయించేవారు. ఆ తరువాత ఇందులో మార్పులు వచ్చాయి.

World Bank Report: భారత్‌ ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు.. వరల్డ్ బ్యాంక్ సూచన ఇదే..

#Tags