Indian Stock Market: చరిత్రాత్మక ఘనత సాధించిన భారత స్టాక్ మార్కెట్!
భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక మైలురాయిని దాటింది.
6 నెలల కాలంలోనే అద్భుతమైన 1 ట్రిలియన్ డాలర్ల సంపదను సృష్టించింది. ఈ రోజు చరిత్రలో తొలిసారిగా 5 ట్రిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో విదేశీ పెట్టుబడిదారుల నుంచి ప్రతికూలత ఉన్నప్పటికీ, భారత స్టాక్ మార్కెట్ ఈ అద్భుత ఘనతను సాధించడం గమనార్హం. ఈ విజయం భారత ఆర్థిక వ్యవస్థ యొక్క పటిష్టతకు, పెట్టుబడిదారుల నమ్మకానికి నిదర్శనం.
బాంబే స్టాక్ ఎక్సేంజ్ (BSE) మొత్తం మార్కెట్ విలువ రూ.141.75 లక్షల కోట్లకు చేరిందని అంచనా. ఈ ఘనత సాధించడంలో స్థానిక, విదేశీ పెట్టుబడిదారుల యొక్క పెట్టుబడులు కీలక పాత్ర పోషించాయి.
Global Burden of Disease: శుభవార్త.. పెరుగుతున్న మనుషుల సగటు జీవితకాలం!!
#Tags