UPI Payments: రూ.2 వేలు మించి ఫోన్‌పే, గూగుల్‌పే చెస్తే అదనపు చార్జీలు.. ఎవ‌రికి వ‌ర్తిస్తుందంటే..

యూపీఐ యూజర్లు ఇక‌పై చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఏప్రిల్ మొద‌టి నుంచి మొబైల్‌ పేమెంట్‌ యాప్‌ కస్టమర్ల ఆర్థిక లావాదేవీలపై ఫీజు వసూలు చేయనున్న‌ట్లు నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవ‌ల ఓ సర్క్యూలర్‌ జారీ చేసింది.

పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యూపీఐ యాప్స్‌ ద్వారా రూ.2000లకు పైగా లావాదావేలు చేస్తే కొన్ని రకాల చెల్లింపులపై యూపీఐ ద్వారా ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు వసూలు చేయాలని ఎన్‌పీసీఐ నిర్ణయించింది. ఆన్‌లైన్ వాలెట్‌లు లేదా ప్రీ లోడెడ్ గిఫ్ట్ కార్డ్‌లు మొదలైన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (పీపీఐ) ద్వారా రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలకు 1.1 శాతం ఇంటర్ ఛేంజ్‌ ఫీజు వర్తిస్తుంది.

ప్రీపెయిడ్‌ సాధనాల నుంచి యూపీఐ ద్వారా రూ.2000కు పైగా లావాదేవీ జరిపితే టెలికాంకు 0.70 శాతం, మ్యూచువల్‌ ఫండ్‌కు ఒక శాతం, యుటిలిటీస్‌కు 0.70 శాతం, విద్యకు 0.70 శాతం, సూపర్‌ మార్కెట్‌కు 0.90 శాతం, బీమాకు ఒక శాతం, వ్యవసాయానికి 0.70 శాతం కన్వీనియెన్స్‌ స్టోర్‌కు 1.10 శాతం ఇంటర్ ఛేంజ్ ఫీజు వర్తిస్తుంది. అయితే గరిష్ఠంగా రూ.15 మాత్రమే వసూలు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

PAN-Aadhaar link: పాన్‌తో ఆధార్‌ అనుసంధానం గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..?

ఇంటర్‌చేంజ్ రుసుము అనేది వ్యాలెట్ జారీ చేసే బ్యాంకులు లావాదేవీలను అంగీకరించడం, ప్రాసెస్ చేయడం, ఆథరైజ్‌ చేయడం వంటి వాటి కోసం పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి పేమెంట్స్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు చెల్లించాల్సిన రుసుము. కావునా బ్యాంకు, ప్రీపెయిడ్‌ వ్యాలెట్‌ మధ్య పర్సన్‌ టు పర్సన్‌, పర్సన్‌ టు మర్చంట్‌ లావాదేవీలపై ఈ రుసుములు వర్తించవు. అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తికి, ఒక వ్యక్తి వేరే మర్చంట్‌తో చేసే లావాదేవీలపై ఫీజు ఉండదు. ఎన్‌పీసీఐ 1.1 శాతం ఇంటర్ ఛేంజ్‌ ఫీజు అమలు చేస్తున్నా అందరికీ ఇది ఒకేలా వర్తించదు. కొందరు తక్కువ ఫీజుకు అర్హులు అవుతారు. ఉదాహరణకు ఒక ప్రీపెయిడ్‌ సాధనం నుంచి యూపీఐ ద్వారా పెట్రోల్‌ స్టేషన్లో చెల్లిస్తే 0.5 శాతమే ఫీజు వర్తిస్తుంది. 

EPFO: పీఎఫ్‌(PF) వడ్డీరేటు పెంచిన కేంద్రం.. ఎంత శాతం పెంచిందంటే?

పీపీఐ ద్వారా చేసిన రూ.2,000 కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలకు 1.1 శాతం ఇంటర్‌చేంజ్ ఫీజు ఉంటుంది. ఆపై వాలెట్ లోడింగ్ ఛార్జీలు ఉంటాయి. కాబట్టి పేటీఎం లేదా ఓలా ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి ప్రీ పెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్‌లను జారీ చేసేవారు వాలెట్ లోడింగ్ ఛార్జీలుగా 15 బేసిస్ పాయింట్లను రెమిటర్ బ్యాంక్‌కి చెల్లించాలి. మర్చెంట్స్‌ ప్రొఫైల్‌ను బట్టి ఇంటర్‌ఛేంజ్ రుసుము రేట్లు మారుతాయని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది. వివిధ పరిశ్రమలకు ఇంటర్‌ఛేంజ్ రుసుము వేరువేరుగా  ఉంటుంది. లావాదేవీ విలువలో 0.50 శాతం నుంచి 1.10 శాతం వరకు ఛార్జీలు ఉంటాయని ఎన్‌పీసీఐ పేర్కొంది.

DA for Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు..

#Tags