Daily Current Affairs in Telugu: జ‌న‌వ‌రి 19th, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu January 19th 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations

Population: జనాభాలో చైనాను దాటిన భార‌త్ 
ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశంగా భార‌త్‌ అవతరించింద‌ని వరల్డ్‌ పాపులేషన్‌ రివ్యూ (డబ్ల్యూపీఆర్‌) నివేదిక తెలిపింది. గతేడాది చివరి నాటికే భారత జనాభా చైనా కంటే కనీసం 50 లక్షలు ఎక్కువని చెబుతోంది. 2022 డిసెంబర్‌ 31 నాటికి తమ జనాభా 141.2 కోట్లని చైనా జ‌న‌వ‌రి 17న‌ అధికారికంగా ప్రకటించింది. అదే రోజున భారత్‌ జనాభా 141.7 కోట్లకు చేరిందని డబ్ల్యూపీఆర్‌ అంచనా వేసింది. జ‌న‌వ‌రి 18 నాటికి 142.3 కోట్లకు ఎగబాకిందని చెప్పుకొచ్చింది. మాక్రోట్రెండ్స్‌ అనే మరో సంస్థ అంచనాల ప్రకారం జ‌న‌వ‌రి 18 నాటికి భారత జనాభా 142.8 కోట్లు. మన జనాభాలో 50 శాతానికి పైగా 30 ఏళ్లో లోపు వయసువారే. కనుక దేశ జనాభా పెరుగుదల 2050 దాకా కొనసాగుతూనే ఉంటుందని భావిస్తున్నారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (సైన్స్ & టెక్నాలజీ) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)
1961 తర్వాత తొలిసారిగా 2022లో తమ జనాభాలో తొలిసారిగా 8.5 లక్షల మేరకు తగ్గుదల నమోదైనట్టు చైనా ఇప్ప‌టికే ప్రకటించింది. ఈ ధోరణి ఇలాగే కొనసాగి 2050 కల్లా ఆ దేశ జనాభా 131 కోట్లకు పరిమితం అవుతుందని అంచనా. ఆ సమయానికి భారత జనాభా 166 కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నారు. పదేళ్లకోసారి జరిగే ఆనవాయితీ మేరకు మన దేశంలో 2020లో జరగాల్సిన జనాభా గణన కరోనా కారణంగా వాయిదా పడటం తెలిసిందే. దాంతో మన జనాభాపై అధికారికంగా తాజా గణాంకాలు అందుబాటులో లేవు.  

Population: చైనాలో తగ్గిన జనాభా.. 1961 తర్వాత ఇదే తొలిసారి

Lucile Randon: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలి కన్నుమూత
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గుర్తింపుపొందిన ఫ్రాన్స్‌ దేశస్తురాలు లూసిలీ ర్యాండమ్‌(118) జ‌న‌వ‌రి 17వ తేదీ టౌలూన్‌ పట్టణంలో తుది శ్వాస విడిచారు. కోవిడ్‌ను జయించిన అత్యంత వృద్ధుల్లో ఒకరిగానూ చరిత్ర సృష్టించిన ఈమెను స్థానికులు సిస్టర్‌ ఆండ్రీగా పిలుస్తారు. 1904 ఫిబ్రవరి 11న దక్షిణ ఫ్రాన్స్‌లోని ఎలీస్‌ పట్టణంలో జన్మించిన ఈమె వృత్తిరీత్యా నర్సు. 2021 జనవరిలో ఈమెకు కరోనా సోకింది. అయితే, పెద్దగా అనారోగ్య లక్షణాలేవీ కనిపించకపోవడం విశేషం. కోవిడ్‌ను జయించిన బామ్మగా ప్రాచుర్యంపొందారు. ‘కష్టంగా భావించకుండా ఇష్టంగా పనిచేయడమే నా ఆరోగ్య రహస్యం. 108 ఏళ్ల వరకు నా పనులు నేనే చేసుకున్నా. రోజూ ఒక చాక్లెట్‌ తినడం, ఒక గ్లాస్‌ వైన్‌ తాగడం నా అలవాటు’ అని ఆండ్రీ గతంలో చెప్పారు. ర్యాండమ్‌ మృతి తర్వాత స్పెయిన్‌లో నివసిస్తున్న 115 ఏళ్ల అమెరికన్‌ మరియా బ్రాన్‌యాస్‌ మొరేరా ప్రపంచంలో అత్యంత వృద్ధ వ్యక్తిగా రికార్డులకెక్కారు. 

Tallest Man: ఎత్తు 7 అడుగుల 4 అంగుళాలు.. గిన్నిస్‌ రికార్డుకెక్కే చాన్స్‌

Visa: ‘వీసా వెయిటింగ్‌’ తగ్గిస్తాం.. అమెరికా
అమెరికా వీసాల కోసం భారతీయులు వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గించేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నామని యూఎస్‌కౌన్సిలర్‌ అఫైర్స్‌ బ్యూరోలో వీసాల జారీ విభాగం ఉన్నతాధికారి జూలీ స్టఫ్‌ చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ కూడా ఈ విషయంలో చొరవ తీసుకుంటున్నారన్నారు. ‘‘గత అక్టోబర్‌లో బిజినెస్‌(బీ1), పర్యాటక(బీ2) వీసాల వెయిటింగ్‌ పీరియడ్‌ మూడేళ్లుంది! వీటిని తగ్గించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాం. కోవిడ్‌కు ముందునాటి సాధారణ స్థాయికి తేవడంపై దృష్టిసారించాం. హెచ్‌–1బీ, ఎల్‌1 వీసాల వెయిటింగ్‌ పీరియడ్‌ను 18 నెలల నుంచి 60 రోజులకు కుదించగలిగాం’’ అని ఆమె చెప్పారు. ‘‘ఇంటర్వ్యూతో పనిలేని సందర్భాల్లో వీసా రెన్యువల్‌కు వేచి ఉండాల్సిన పనిలేదు. ఇండియాతోపాటు జర్మనీ, థాయ్‌లాండ్‌లలోనూ భారతీయుల వీసా జారీ కోసం ఎంబసీలు, కాన్సులేట్‌లకు మరింత మంది సిబ్బందిని పంపుతున్నాం. వారాంతాల్లోనూ ఇంటర్వ్యూలు చేస్తున్నారు’’ అని చెప్పారు.

H-1B Visa: హెచ్‌1బీ వీసా ఫీజు పెంపు!

Assembly Elections 2023: మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుద‌ల‌
త్రిపుర, నాగాలాండ్, మేఘాలయల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. త్రిపురలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్, మేఘాలయల్లో 27న పోలింగ్‌ జరగనుంది. మార్చి 2న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటాయి. జనవరి 31న నోటిఫికేషన్‌ రానుంది. ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్ జ‌న‌వ‌రి 18వ తేదీ మీడియాకు ఈ మేరకు వెల్లడించారు. మార్చిలో పరీక్షలున్నందున ఫిబ్రవరిలోనే ఎన్నికల ప్రక్రియను ముగించాలని నిర్ణయించినట్టు వివరించారు.  వాతావరణం, భద్రత తదితర అంశాలను పరిగణలోనికి తీసుకుని జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. లక్షద్వీప్‌ లోక్‌సభ స్థానంతో పాటు ఐదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు కూడా ఫిబ్రవరి 27నే ఉప ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో మహారాష్టలో 2, అరుణాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, తమిళనాడుల్లో ఒక్కో అసెంబ్లీ స్థానం ఉన్నాయి. లక్షద్వీప్‌ ఎన్సీపీ ఎంపీ మొహమ్మద్‌ ఫైజల్‌ క్రిమినల్‌ కేసులో దోషిగా తేలి అనర్హతకు గురవడంతో ఆ స్థానం ఖాళీ అవడం తెలిసిందే. కాంగ్రెస్‌ ఎంపీ సంతోఖ్‌ సింగ్‌ మరణంతో పంజాబ్‌లోని జలంధర్‌ లోక్‌సభ స్థానం ఖాళీ అయినా లోక్‌సభ సచివాలయం నుంచి ఈసీకి అధికారికంగా సమాచారం లేక‌పోవ‌డంతో అక్కడ ఉప ఎన్నిక జరగడం లేదు. పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)

Pakistan: పతనం అంచున పాక్‌..  ప్రపంచదేశాల ముందు చేయి చాస్తున్న వైనం
‘‘భారత్‌తో మూడు యుద్ధాలు చేశాం. సాధించింది ఏమీ లేదు. దేశంలో మరింత విధ్వంసం జరిగింది. నిరుద్యోగం పేదరికం మీద పడ్డాయి. యుద్ధానికి కారణమైన కశ్మీర్‌ వంటి అంశాలపై భారత్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నాం’’  ‘‘అణ్వాయుధాలు కలిగిన మన దేశం అన్నవస్త్రాల కోసం ప్రపంచ దేశాల ముందు దేహి అంటూ చేయి చాపడం నిజంగా సిగ్గు చేటు. అంతర్జాతీయ సంస్థల్ని రుణాలు అడగాలన్నా ఇబ్బందిగా అనిపిస్తోంది. ఇలా ప్రపంచ దేశాలను భిక్షమడిగి దేశాన్ని ఆర్థికంగా గట్టెక్కించడం పరిష్కారం కాదు’’ 
ఈ వ్యాఖ్యలు చేసినది ఎవరో కాదు. సాక్షాత్తూ పాకిస్తాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌. రోజు రోజుకీ దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారి పోతూ ఉండడంతో మరో దారి లేక షరీఫ్‌ శాంతి మంత్రం జపిస్తున్నారు. భారత్‌తో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకుంటే ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కుతామన్న భావనలో పాక్‌ సర్కార్‌ ఉంది.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)
గోధుమల లారీని వెంబడించి..!  
పాకిస్తాన్‌లో ప్రధాన ఆహారమైన గోధుమ పిండికి విపరీతమైన కొరత ఏర్పడింది. నిరుపేదలు గోధుమ పిండి కొనుక్కోవడానికి గంటల తరబడి దుకాణాల దగ్గర క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో కరాచీలో ఒక గోధుమ పిండి లారీ వెళుతూ ఉంటే దాని వెనక ప్రజలు పరుగులు తీసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఒక్క వీడియో చాలు పాక్‌లో ఆహార సంక్షోభం ఏ స్థాయికి చేరుకుంటోందో చెప్పడానికి. బియ్యం, గోధుమలు, కూరగాయలు డిమాండ్‌కు తగ్గ సప్లయి కావడం లేదు. పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

Food Crisis: పాకిస్తాన్‌లో ఆహార సంక్షోభం.. మార్కెట్లలో తొక్కిసలాటలు
Tiger Attack: మనిషికి, మృగానికి మధ్య పెరుగుతున్న ఘర్షణలు
దేశంలో ఒక పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంటే.. మరోపక్క పోడు వ్యవసాయం, ఇతరత్రా కారణాలతో అటవీ ప్రాంతం కుంచించుకుపోవడం కొత్త సమస్య తెచ్చిపెడుతోంది. మనిషికీ, వన్య మృగానికీ మధ్య ఘర్షణకు దారితీస్తోంది. పులులు అడవులను దాటి సమీపంలోని గ్రామాలు, పట్టణాల్లో ప్రవేశించడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది.  
పదేళ్లలో 100% పెరుగుదల 
దేశంలో గత పదేళ్ల కాలంలో చిరుతలు, పెద్ద పులుల సంఖ్య అనూహ్యంగా 100 శాతం పెరిగిందని తాజాగా చేపట్టిన గణన ద్వారా వెల్లడైంది. దాదాపు నాలుగు వేల మంది అటవీ శాఖ సిబ్బంది 54 టైగర్‌ రిజర్వు ప్రాంతాల్లోని 14,500 చదరపు కి.మీ. మేర అడవుల్ని గాలించి మరీ 4,500 పైచిలుకు పెద్ద పులులు, 2,300 చిరుతలు ఉన్నాయని లెక్క తేల్చారు. దేశంలో మిజోరం మినహా అన్ని రాష్ట్రాల్లో పులుల జాడ కనిపించడం విశేషం.
వన్యమృగ సంరక్షణ చరిత్రలో ఇది గుర్తుంచుకోదగిన విశేషమని కజిరంగ నేషనల్‌ పార్క్‌ డివిజనల్‌ ఫారెస్ట్‌ అధికారి రమేశ్‌ గగోయ్‌ అన్నారు. ప్రస్తుతం అక్కడ అనేక రకాల వందల కొద్దీ జంతువులతో పాటు 125కు పైగా పులులు ఉన్నాయి. పులుల సంఖ్య పెరగడం శుభసూచకమే అయినా మనుషులకు, మృగాలకు మధ్య కొనసాగుతున్న ఘర్షణ దేశంలో కొన్నిచోట్ల రక్తసిక్తం కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.   పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

Jaguar Vs Cheetah Vs Leopard : చీతా.. చిరుత.. జాగ్వార్‌.. ఈ మూడింటిలో ఏది గ్రేట్‌ అంటే..?


Bharti Airtel: హైదరాబాద్‌లో హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్ ఏర్పాటుకు ఎయిర్‌టెల్‌ రూ.2,000 కోట్ల పెట్టుబడి..  

దేశంలో టెలికం రంగంలోని అగ్రగామి సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ హైదరాబాద్‌లో రూ.2 వేల కోట్ల భారీ పెట్టుబడితో హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు చేయనుంది. డేటా స్టోరేజ్, విశ్లేషణలో అత్యాధునిక సాంకేతికత అయిన హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ను తన అనుబంధ సంస్థ అయిన ‘నెక్స్‌ ట్రా’ ద్వారా భారతీ ఎయిర్‌టెల్‌ నెలకొల్పనుంది. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.2 వేల కోట్లను పెట్టుబడిగా పెడుతామని ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. ఫ్రాన్స్‌కు చెందిన ఆహారం, పర్యావరణం, ఔషధాలు, కాస్మోటిక్స్‌ పరీక్షల సంస్థ యూరోఫిన్స్‌.. జీనోమ్‌ వ్యాలీలో అధునాతన ప్రయోగశాల ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. 
– దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవీలియన్‌లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావుతో భారతీ ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ భారతీ మిట్టల్, వైస్‌ చైర్మన్, ఎండీ రాజన్‌ భారతీ మిట్టల్, యూరోఫిన్స్‌ సీఈవో డాక్టర్‌ గిల్లెస్ మార్టిన్‌లు విడివిడిగా సమావేశమయ్యారు. సమావేశానంతరం 60 మెగావాట్ల సామర్థ్యంతో ఈ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు భారతీ ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. డేటా భద్రతలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే ఈ డేటాసెంటర్‌ రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు కొనసాగించనున్నట్లు తెలిపారు.  

Allox Advance Materials: తెలంగాణ‌లో మల్టీ గిగా వాట్‌ లిథియం క్యాథోడ్‌ మెటీరియల్‌ తయారీ కేంద్రం
– భారతీ ఎయిర్‌టెల్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ సునీల్‌ భారతీ మిట్టల్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఇండియాలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్‌ డేటా సెంటర్‌ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా పేర్కొన్నారు. 2022 మే నెల‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాల్లో ప్రారంభమైన డేటా సెంటర్‌ ఏర్పాటు చర్చలు నెలల వ్యవధిలోనే కార్యరూపం దాల్చడానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషి కారణమన్నారు. 

జీనోమ్‌ వ్యాలీలో.. యూరోఫిన్స్‌ ప్రయోగశాల.. 
హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలో అత్యాధునిక పరిజ్ఞానంతో ప్రయోగశాల (టెస్టింగ్‌ ల్యాబ్‌) ఏర్పాటు చేయనున్నట్లు ఫ్రాన్స్‌కు చెందిన యూరోఫిన్స్‌ ప్రకటించింది. ఆహారం, పర్యావరణం, ఫార్మా, కాస్మెటిక్‌ ఉత్పత్తుల పరీక్షలతో పాటు బయో అనలిటికల్‌ టెస్టింగ్‌లో గ్లోబల్‌ లీడర్‌గా ఉన్న యూరోఫిన్స్‌ హైదరాబాద్‌లో అధునాతన ప్రయోగశాలను నెలకొల్పాలని నిర్ణయించింది. తద్వారా భారతీయ ఔషధ మార్కెట్‌లోకి విస్తరించాలని ప్రణాళిక రూపొందించింది.
90,000 అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే ఈ అత్యాధునిక ప్రయోగశాలలో సింథటిక్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఎనలిటికల్‌ ఆర్‌ అండ్‌ డీ, బయో అనలిటికల్ సర్వీసెస్, ఇన్‌–వివో ఫార్మకాలజీ, సేఫ్టీ టాక్సికాలజీ రంగాలకు చెందిన దేశ, విదేశ ఫార్మాస్యూటికల్‌ కంపెనీలతో పాటు చిన్న బయోటెక్‌ కంపెనీలకు అవసరమైన సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించింది. తన అనుబంధ సంస్థ ‘యూరోఫిన్స్‌ అడ్వినస్‌’ ద్వారా హైదరాబాద్‌లో ఈ ప్రయోగశాలను యూరోఫిన్స్‌ ఏర్పాటు చేయనుంది. ఫార్ములేషన్‌ డెవలప్‌మెంట్‌తో పాటు ఇన్‌–విట్రో, ఇన్‌–వివో బయాలజీ విభాగాల్లో తన సేవలను విస్తరించేందుకు 2023 వ సంవత్సరం ప్రారంభం నుంచే యూరోఫిన్స్‌ అడ్వినస్‌కు ఈ ల్యాబ్‌తో అవకాశం కలుగుతుంది. యూరోఫిన్స్‌ సీఈఓ డాక్టర్‌ గిల్లెస్ మార్టిన్‌ మాట్లాడుతూ ఔషధాల పరిశోధన, తయారీలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌ క్యాంపస్‌ ద్వారా ఔషధాల అభివృద్ధి, ఆవిష్కరణల్లో కీలకం కానున్నట్లు చెప్పారు. 

Apollo Tyres: హెదరాబాద్‌లో డిజిటల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌