Allox Advance Materials: తెలంగాణలో మల్టీ గిగా వాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రం
Sakshi Education
బ్యాటరీల తయారీలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన అలాక్స్ అడ్వాన్స్ మెటీరియ ల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణలో రూ.750 కోట్ల పెట్టుబడితో మల్టీ గిగా వాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి కె.తారక రామారావు సమక్షంలో అలాక్స్ ప్రతినిధులు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ భారీ పరిశ్రమలో లిథియం ఐరన్ ఫాస్పేట్ బ్యాటరీలు తయారవుతాయి.
తొలుత రూ.210 కోట్ల పెట్టుబడి..
రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా తొలుత రూ.210 కోట్ల పెట్టుబడితో, మూడు గిగా వాట్ల సామర్థ్యంతో లిథియం ఐరన్ ఫాస్పేట్ బ్యాటరీలను ఉత్పత్తి చేయనున్నట్లు అలాక్స్ తెలిపింది. ఈ సామర్థ్యాన్ని భవిష్యత్తులో పది గిగా వాట్లకు పెంచనున్నట్లు స్పష్టం చేసింది. 2030 సంవత్సరం నాటికి మొత్తంగా రూ.750 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు వివరించింది. ప్రతిపాదిత తయారీ కేంద్రంతో సుమారు 600 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (17-23 డిసెంబర్ 2022)
Published date : 18 Jan 2023 05:41PM