Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 20th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu September 20th 2022 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Current Affairs in Telugu September 20th 2022

AP ఉప సభాపతిగా ‘కోలగట్ల’ ఏకగ్రీవం

 

ఏపీ శాసనసభ ఉప సభాపతిగా కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సెప్టెంబర్ 19న  ప్రశ్నోత్తరాల కార్యక్రమం అనంతరం ఉప సభాపతిగా వీరభద్రస్వామి ఏకగ్రీవమైనట్లు సభాపతి తమ్మినేని సీతారాం ప్రకటించారు. 

Also read: ABC నూతన చైర్మన్‌గా ప్రతాప్‌ పవార్‌

మన కంటికి కనిపించని అద్భుతాలు.. డ్రోన్‌ కంటితో చూడొచ్చు.. 

 

2022 సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా 116 దేశాల నుండి 2,600 మంది ఫోటోగ్రాఫర్‌లు వేలకొద్దీ వైమానిక చిత్రాలను పోటీకి సమర్పించారు. ఇందులో భాగంగా కొన్ని చిత్రాలు.. 2022 డ్రోన్‌ ఫొటో పురస్కారాల్లో అర్బన్‌ కేటగిరీలో జ్యూరీ ప్రశంసలను అందుకున్నాయి. 

Also read: Space Science Institute: సౌర వలయాలు

ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌ను చుట్టుముట్టేస్తున్నట్లు కనిపిస్తున్న తుపాను మేఘం..

సహారా ఎడారిలో చివరెక్కడుందో తెలియనంత పొడవున్న గూడ్సు రైలు..

భారతదేశంలోని ఆగ్రాలోని మంచుదుప్పట్లో మురిపిస్తున్న తాజ్‌మహల్‌ 

Also read: Astronomy photo: తోకచుక్క చెదురుతున్న వేళ...

Dalit Bandhu: దళితబంధు 600కోట్లు.. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అమలు వేగం పుంజుకుంది.  ఈ పథకానికి ప్రభుత్వం తాజాగా రూ.600 కోట్లు విడుదల చేసింది. దీంతో చర్యలకు ఉపక్రమించిన ఎస్సీ కార్పొరేషన్‌.. ఈ పథకం కింద ఇప్పటివరకు ఎంపికైన లబ్ధిదారులందరికీ ఆర్థిక సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో ఇప్పటివరకు 38,476 మంది లబ్ధిదారులు ఈ పథకం కింద ఎంపికయ్యారు. ప్రస్తుతం ఎంపికైన లబ్ధిదారుల ఖాతాల్లో రూ.3,847.6 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. 

Also read: Telangana : తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్‌ పేరు.. అలాగే పార్లమెంట్‌ కొత్త భవనానికి కూడా..

హుజూరాబాద్‌తో షురూ
దళితబంధు పథకం ఇప్పటివరకు నాలుగు కేటగిరీల్లో అమలైంది. తొలుత కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఉన్న దళిత కుటుంబాలకు పూర్తిస్థాయిలో పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ మేరకు లబ్ధిదారుల ఎంపిక మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆ నియోజకవర్గంలో మొత్తం 18,211 కుటుంబాలను గుర్తించిన యంత్రాంగం.. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున అర్హులందరి ఖాతాల్లో నిధులను జమ చేసింది.  

Also read: Telangana National Integration Day: సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం
 
కొత్తగా నియోజకవర్గానికి 500 యూనిట్లు..
2022–23 వార్షిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 1,500 యూనిట్ల చొప్పున ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. అయితే తొలి విడత కింద ప్రతి సెగ్మెంట్‌కు 500 చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది.  

Also read: Telangana: బుద్ధవనంలో రూ.100 కోట్ల పెట్టుబడులు

Samudrayan Project: సముద్రాల గుట్టు ఛేదించే మత్స్య యంత్రం

 

సముద్రాల్లో మత్స్య సంపద మాత్రమేగాకుండా ఖనిజాలు, మూలకాలు వంటి ఎన్నో వనరులు ఉన్నాయి. వాటిని గుర్తించడం, వెలికితీసి వినియోగించుకోవడం.. సముద్ర ఆధారిత ఎకానమీని అభివృద్ధి లక్ష్యంగా భారత్‌
‘డీప్‌ ఓసియన్‌ మిషన్‌’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా వేల మీటర్ల లోతుకు వెళ్లగలిగే ప్రత్యేక వెహికల్స్‌ను, సాంకేతికలను అభివృద్ధి చేయనుంది. ఈ క్రమంలో రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా దేశాలతో కలిసి పనిచేయనుంది.

Also read: Weekly Current Affairs (Economy) Bitbank: భారతదేశపు మొట్టమొదటి గోల్డ్ అండ్ సిల్వర్ ఫండ్‌ను ఏ MF హౌస్ ప్రారంభించింది?

ఆరు వేల మీటర్ల అడుగుకు వెళ్లగలిగేలా.. 
సముద్రయాన్‌ ప్రాజెక్టులో భాగంగా.. సముద్రాల అడుగున మానవ సహిత ప్రయోగాల కోసం ప్రత్యేకమైన వాహనాన్ని (డీప్‌ వాటర్‌ సబ్‌ మెర్సిబుల్‌ వెహికల్‌)ను భారత్‌ అభివృద్ధి చేయనుంది. ముగ్గురు శాస్త్రవేత్తలు ఆరు వేల మీటర్ల (ఆరు కిలోమీటర్లు) లోతుకు వెళ్లి పరిశోధనలు చేయగలిగేలా దాన్ని రూపొందిస్తున్నారు. అందులో వివిధ సెన్సర్లు, శాస్త్రీయ పరికరాలు, సముద్రం అడుగున తవ్వడం, కదిలించడానికి వీలయ్యే ఉపకరణాలు ఉంటాయి. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషియన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ) శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలకు నేతృత్వం వహించనున్నారు. 

Also read: Weekly Current Affairs (Sports) Bitbank: U-20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లింగ్ జట్టు ఎన్ని పతకాలు సాధించింది?

మత్స్య 6000 పేరుతో.. 
ఇస్రో, ఐఐటీ మద్రాస్, డీఆర్‌డీవో తదితర సంస్థల సహకారంతో ఎన్‌ఐఓటీ శాస్త్రవేత్తలు ఇప్పటికే ‘మత్స్య 6000’పేరుతో డీప్‌ వాటర్‌ వెహికల్‌ ప్రాథమిక డిజైన్‌ను రూపొందించారు. గోళాకారంలో రూపొందించిన ఈ డీప్‌ వాటర్‌ వెహికల్‌ను సిద్ధం చేయడానికి సుమారు రూ.350 కోట్లు ఖర్చవుతుందని అంచనా. 

  • సముద్రాల అడుగున అత్యంత తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. నీటి సాంద్రత, విజిబిలిటీ వంటివి భిన్నంగా ఉంటాయి. వీటిని తట్టుకునేలా డీప్‌వాటర్‌ వెహికల్‌ను రూపొందించాల్సి ఉంటుంది. అంతేగాకుండా ఆ లోతుల్లో పనిచేసే సెన్సర్లు, పరికరాలను, ఆక్సిజన్, అత్యవసర రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సి ఉండనుంది. 
  • మొదట ఈ ఏడాది చివరినాటికి 500 మీటర్ల లోతు వరకు వెళ్లే డీప్‌ వాటర్‌ వెహికల్‌ ను రూపొందించనున్నారు. 2024 మార్చి నాటికి పూర్తిస్థాయి ‘మత్స్య 6000’వాహనాన్ని సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 
  • సముద్రాల్లో వెయ్యి మీటర్ల నుంచి 5,500 మీటర్ల లోతు వరకు గ్యాస్‌ హైడ్రేట్లు, మాంగనీస్, సలై్ఫడ్లు, కోబాల్ట్‌ వంటి ఖనిజాలు లభిస్తాయి. వాటిని వెలికితీసే అవకాశాలను ఎన్‌ఐఓటీ శాస్త్రవేత్తలు పరిశీలించనున్నారు. 
  • ‘మత్స్య 6000’సాయంతో దేశం చుట్టూ ఉన్న సముద్రాల
  • అడుగున జీవజాలంపై పరిశోధనలు చేయనున్నారు. సముద్రాల్లో మునిగిన ఓడలు, ఇతర వస్తువుల పరిశీలన సేకరణ, నీటి అడుగున ఫైబర్‌ కేబుళ్లు, ఇతర పరికరాల ఏర్పాటు, మరమ్మతులకు దీనిని వినియోగించుకోనున్నారు.  

Also read: Weekly Current Affairs (Science & Technology) Bitbank: జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా ఏ గ్రహం యొక్క కొత్త చిత్రాలు తీయబడ్డాయి?

Tennis Singles Rankings: భారత నంబర్‌వన్‌గా కర్మన్‌ కౌర్‌ 

 

 ఐదేళ్ల తర్వాత భారత మహిళల టెన్నిస్‌ సింగిల్స్‌లో నంబర్‌వన్‌గా కొత్త క్రీడాకారిణి వచ్చింది. 2017 నుంచి భారత టాప్‌ ర్యాంకర్‌గా కొనసాగుతున్న అంకితా రైనా సెప్టెంబర్ 19న విడుదల చేసిన సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి పడిపోయింది. చెన్నై ఓపెన్‌ లో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరిన కర్మన్‌ కౌర్‌ భారత కొత్త నంబర్‌వన్‌గా అవతరించింది. 

Also read: Football Durand Cup: విజేతగా బెంగళూరు FC

కర్మన్‌ 37 స్థానాలు ఎగబాకి 322వ ర్యాంక్‌కు చేరగా... 
చెన్నై ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే ఓడిన అంకిత నాలుగు స్థానాలు పడిపోయి 329వ ర్యాంక్‌లో నిలిచింది.   

Also read: SIPB: రాష్ట్రంలో 36,380 మందికి ఉపాధి లభించేలా రూ.1,26,622.23 కోట్లు పెట్టుబడులు

Golden Glove International Youth Boxing: భారత్‌కు పతకాల పంట 

 

గోల్డెన్‌ గ్లవ్‌ అంతర్జాతీయ యూత్‌ బాక్సింగ్‌ టోర్నీలో భారత బాక్సర్లు అదరగొట్టారు. 
పది స్వర్ణ పతకాలతో కలిపి మొత్తం 19 పతకాలతో తమ పంచ్‌ పవర్‌ను చాటుకున్నారు. 
భావన శర్మ (48 కేజీలు), దేవిక ఘోర్పడే (52 కేజీలు), కుంజరాణి దేవి (60 కేజీలు), రవీనా (63 కేజీలు), కీర్తి (ప్లస్‌ 81 కేజీలు), విశ్వనాథ్‌ (48 కేజీలు), ఆశిష్‌ (54 కేజీలు), సాహిల్‌ (71 కేజీలు), జాదుమణి (51 కేజీలు), భరత్‌ జూన్‌ (92 కేజీలు) పసిడి పతకాలు సాధించారు. ముస్కాన్‌ (75 కేజీలు), ప్రాంజల్‌ యాదవ్‌ (81 కేజీలు) రజత పతకాలు నెగ్గారు. కశిష్‌ (50 కేజీలు), నీరూ (54 కేజీలు), ఆర్య (57 కేజీలు), ప్రియాంక (66 కేజీలు), లాషు (70 కేజీలు), నిఖిల్‌ (57 కేజీలు), దీపక్‌ (75 కేజీలు) కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు.   

Also read: Weekly Current Affairs (Persons) Bitbank: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు?

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

#Tags