Daily Current Affairs in Telugu: 16 డిసెంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.
16 december daily current affairs in telugu

1. విశాఖలోని ఇండియన్‌ నేవీ నేవల్‌ బేస్‌ ఐఎన్‌ఎస్‌ ఏకశిలలో గ్యాస్‌ టర్బైన్‌ టెక్నాలజీలో స్వయం ప్రతిపత్తిని సాధించింది.

2. భారత్‌ 2026 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని,  దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువ  అప్పటికి 5 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగారియా విశ్లేషించారు.

Daily Current Affairs in Telugu: 15 డిసెంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

3. ఏపీలో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య పరిమితిని ఏకంగా రూ.25 లక్షలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.  

4. పర్యావరణ కాలుష్య నివారణ సదస్సులో ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌ ఉత్తమ పేపర్‌ ప్రజెంటేషన్‌ అవార్డును గెలుచుకుంది.

5. విదేశీ పర్యాటకులు, సందర్శకులకు ఆకర్షించేందుకు ఇరాన్‌ ప్రభుత్వం భారత్‌ సహా 33 దేశాల వారికి వీసా లేని ప్రయాణాలకు అనుమతులివ్వనున్నట్లు ప్రకటించింది. 

Daily Current Affairs in Telugu: 14 డిసెంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

#Tags