India-Taliban Meet: తాలిబన్‌ నేత అబ్బాస్‌తో చర్చించిన భారత రాయబారి?

తాలిబన్‌ నేత షేర్‌ మహ్మద్‌ అబ్బాస్‌ స్టానెక్జాయ్‌తో ఖతార్‌ రాజధాని దోహాలో ఆగస్టు 31న భారత రాయబారి దీపక్‌ మిట్టల్‌ సమావేశమయ్యారు.
ఫైలో ఫొటో

 ఇరుపక్షాల మధ్య ఈ స్థాయి చర్చలు జరగడం ఇదే తొలిసారి. అఫ్గాన్‌ గడ్డపై భారత వ్యతిరేకశక్తులను అడ్డుకోవడం, భారతీయుల స్వదేశానికి రాక తదితర అంశాలు చర్చకొచ్చాయి. తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని తాలిబన్లు హామీ ఇచ్చినట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. అఫ్గాన్‌తో వ్యవహరించాల్సిన తీరును చర్చించేందుకు ఉన్నతస్థాయి బృందాన్ని ప్రభుత్వం ఏర్పరిచింది. ఇందులో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ తదితరులున్నారు.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : తాలిబన్‌ నేత షేర్‌ మహ్మద్‌ అబ్బాస్‌ స్టానెక్జాయ్‌తో చర్చలు
ఎప్పుడు    : ఆగస్టు 31
ఎవరు    : భారత రాయబారి దీపక్‌ మిట్టల్‌
ఎక్కడ    : దోహా, ఖతార్‌
ఎందుకు    : అఫ్గాన్‌ గడ్డపై భారత వ్యతిరేకశక్తులను అడ్డుకోవడం, భారతీయుల స్వదేశానికి రాక తదితర అంశాలు చర్చలు జరిపేందుకు...
 

#Tags