Film Awards: రాష్ట్ర చలనచిత్ర అవార్డుల విజేతల జాబితా ఇదే..

రాష్ట్ర చలనచిత్ర అవార్డులను తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

అవార్డుల ప్రధానోత్సవం మార్చి 6వ తేదీ జరగనుంది. ఈ కార్యక్రమం రాజా అన్నామలైపురంలో ఉన్న ముత్తమిలిప్ అసెంబ్లీలో నిర్వ‌హించ‌నున్నారు. తమిళనాడు అభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం.యు.సామినాథన్‌ అధ్యక్షతన ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు గ్రహీతలకు బంగారు పతకాలు, చెక్కు, జ్ఞాపికలు, ఉత్తమ చిత్రాల నిర్మాతలకు సర్టిఫికెట్లు అందజేస్తారు.

2015 సంవత్సరానికి గాను తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర చలనచిత్ర అవార్డుల విజేతల జాబితా ఇదే..

ఉత్తమ చిత్రం:

  • తని ఒరువన్
  • పసంగ 2
  • ప్రభ
  • పూతిచ్చుచుటు
  • 36 వయదిలిలే

ఉత్తమ నటుడు:

  • మాధవన్ (ఇరుది సుట్రు)

ఉత్తమ నటి:

  • జ్యోతిక (36 వయదిలిలే)

ప్రత్యేక అవార్డులు:

  • ఉత్తమ నటుడు: గౌతమ్ కార్తీక్ (వై రాజా వై)
  • ఉత్తమ నటి: రితికా సింగ్ (ఇరుది చుట్టు)

Grammy Awards 2024: ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డులు అందుకున్న భారతీయులు వీరే..

ఇతర అవార్డులు:

  • ఉత్తమ విలన్: అరవింద్ సామీ (తని ఒరువన్)
  • ఉత్తమ కథా రచయిత: మోహన్ రాజా (తని ఒరువన్)
  • ఉత్తమ సంగీత దర్శకుడు: జిబ్రాన్ (పాపనాశం, ఉత్తమ విలన్)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: రామ్‌జీ (తని ఒరువన్)

గమనిక:

  • ఈ అవార్డులతో పాటు, తమిళనాడు ప్రభుత్వ ఎం.జి ఆర్. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులకు కూడా పలు అవార్డులను ప్రదానం చేస్తారు.

#Tags