Order of Mubarak Al Kabeer: మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్–కబీర్’ పురస్కారం
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కువైట్ అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్–కబీర్’ లభించింది.
కువైట్ రాజు షేక్ మెషల్ అల్–అహ్మద్ అల్–జబేర్ అల్–సబా డిసెంబర్ 22వ తేదీ ఆయనకు ఈ అవార్డు ప్రదానం చేశారు. ఇది మోదీకి దక్కిన 20వ అంతర్జాతీయ గౌరవం.
- స్నేహానికి చిహ్నంగా దేశాధినేతలు, విదేశీ దౌత్యవేత్తలు, విదేశీ రాజకుటుంబ సభ్యులకు కువైట్ ఇచ్చే అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ అవార్డు.
- గతంలో బిల్ క్లింటన్, ప్రిన్స్ చార్లెస్, జార్జ్ బుష్ వంటి విదేశీ నేతలు ఈ పురస్కారం అందుకున్నారు.
- ప్రధాని మోదీ డిసెంబర్ 21, 22వ తేదీలో గల్ఫ్ దేశమైన కువైట్‌లో పర్యటించారు.
PM Modi: ప్రధాని మోదీ కువైట్ పర్యటన.. 43 ఏళ్లలో ఇదే మొదటిసారి..
#Tags