National Award: ఇద్ద‌రు ఏపీ ఉపాధ్యాయులకు జాతీయ అవార్డు

విద్యారంగంలో ఉత్త‌మ సేవలు అందించిన ఉపాధ్యాయుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం అందించే జాతీయ ఉత్త‌మ ఉపాధ్యాయ అవార్డుల‌కు ఈ ఏడాది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఇద్ద‌రు ఉపాధ్యాయులు ఎంపిక‌య్యారు.

కృష్ణా జిల్లా, గుడివాడ ఎస్పీఎస్ మున్సిప‌ల్ స్కూల్‌ప్ల‌స్ ఉపాధ్యాయుడు మిద్దె శ్రీనివాస‌రావు, తిరుప‌తి జిల్లా శ్రీకాళ‌హ‌స్తి మండ‌లం ఉరందూరు జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల ఉపాధ్యాయుడు కూనాటి సురేశ్ ఈ అవార్డుల‌కు ఎంపిక‌య్యారు. 

మిద్దె శ్రీనివాసరావు గుడివాడ 9, 10వ తరగతుల భౌతిక రసాయన శాస్త్రం, 7వ తరగతి సామాన్య రసాయనశాస్త్రం పాఠ్య పుస్తకాలను రచించారు.

అక్కుర్తి గ్రామానికి చెందిన ఈయ‌న‌ ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తూనే పాఠ్యపుస్తకాలను రూపొందించడం, డిజిటల్‌ కంటెంట్‌ క్రియేట్‌ చేయడం, ఉచిత పాఠ్యాంశాలను బోధించే మొబైల్‌యాప్‌ అందించడం వంటి సేవలందించారు. 

సెప్టెంబ‌ర్ 5వ తేదీ ఢిల్లీలో జ‌రిగే ఉపాధ్యాయ దినోత్స‌వ వేడుక‌ల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సురేష్‌, శ్రీనివాసరావు అవార్డులు అందుకోనున్నారు. వీరికి రూ.50 వేల న‌గ‌దు, ర‌జ‌త ప‌త‌కాన్ని అంద‌జేయ‌నున్నారు. 

Lifetime Achievement Award: జయశంకర్‌కు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

#Tags