Guinness Record: గిన్నిస్‌ బుక్‌లో జీఆర్‌టీ జువెలర్స్‌

అత్యధిక బరువున్న బంగారు జుంకాలను తయారు చేసినందుకు జీఆర్‌టీ జువెలర్స్‌ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సాధించింది.

ఈ సంస్థ 6 దశాబ్దాల సుదీర్ఘ ఘన చరిత్రను కలిగి ఉంది. జీఆర్‌టీ జువెలర్స్‌ డిజైనర్లు, హస్త కళాకారులు 22 క్యారెట్ల బంగారుతో, అద్భుతమైన నైపుణ్యంతో 3.527 కిలోగ్రాముల బరువున్న మెగా జుంకాలను రూపొందించారు. ఈ జుంకాలు దక్షిణ భారతదేశ సంస్కృతిని ప్రతిబింబించేలా రూపొందించబడ్డాయి.

ఈ అసాధారణ కృత్యం కోసం జీఆర్‌టీ జువెలర్స్‌కి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ లభించినట్లు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్లు జి.ఆర్‌.ఆనంద్‌ అనంతపద్మనాభన్, జి.ఆర్‌. రాధాకృష్ణన్ తెలిపారు.

Guinness Record: గీతా పారాయణానికి గిన్నిస్ వరల్డ్ రికార్డు

#Tags