Btech Computer Science Seats Increase 2024 : గుడ్‌న్యూస్.. మరో 10000 కంప్యూటర్ సైన్స్ సీట్లు పెంపు..! త్వరలోనే..
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పనున్నది. రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరం2024-25 లోనే మరిన్ని కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత డిమాండ్ ఉన్న బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. గత ఏడాది కన్వీనర్ కోటాలో 68 సీట్లు ఆ బ్రాంచీలవే. ఈసారి మరో 10 వేల వరకు సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఫలితంగా మున్ముందు యాజమాన్య కోటా సీట్లకు కొంత డిమాండ్ తగ్గవచ్చని భావిస్తున్నారు.
7000 సీట్లును..
ఇప్పటికే కొన్నింటికి అనుమతులూ వచ్చాయి. కొన్ని కళాశాలలు 300-400 కొత్త సీట్లకు దరఖాస్తు చేసినట్లు తెలిసింది. జూన్ 10వ తేదీతో అనుమతుల ప్రక్రియ ముగుస్తుంది. అప్పటికి ఎన్ని కొత్త సీట్లు వచ్చాయో స్పష్టమవుతుందని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. కనీసం 10 వేల వరకు రావొచ్చు. అంటే వాటిలో ఏడు వేల సీట్లను కన్వీనర్ కోటా కింద కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు.పెంచుకునే సీట్లకు అవసరమైన తరగతి గదులు, కంప్యూటర్లు, అధ్యాపకులను చూపితే చాలు. అయితే, ఆ కళాశాలలు న్యాక్ ఏ-గ్రేడ్ లేదంటే స్వయం ప్రతిపత్తి హోదా కలిగి ఉండటం తప్పనిసరి. అలాంటి కళాశాలలు రాష్ట్రంలో 65 కుపైగా ఉన్నాయి. దాంతో దాదాపు 50 కళాశాలలు కంప్యూటర్ సైన్స్ సీట్ల కోసం ఏఐసీటీఈకి దరఖాస్తు చేశాయి.
☛ ECE Branch Advantages in Btech : ఇంజనీరింగ్‌లో 'ECE' బ్రాంచ్ తీసుకోవడం ద్వారా వచ్చే.. లాభాలు ఇవే..!